J-K: జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్లు..ఆరుగురు ఉగ్రవాదుల హతం..
- కాల్పుల్లో ఇద్దురు జావాన్లు వీరమరణం
- ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపిన అధికారులు
- కుల్గామ్‌లోని మోదర్గామ్.. చినిగామ్ గ్రామాల్లో ఎన్కౌంటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరని..ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. కుల్గామ్‌లోని మోదర్గామ్, చినిగామ్ గ్రామాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఆరుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు మదర్గాంలో, మిగిలిన నలుగురు చినిగాంలో హతమయ్యారు. కుల్గామ్‌లోని మోదర్గామ్లోని ఒక తోటలో నిర్మించిన రహస్య స్థావరంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు వార్తలు వచ్చాయి. చినిగాం ఫ్రిసల్లో మరో ఉగ్రవాది దాగి ఉన్నట్లు సమాచారం అందింది. ప్రస్తుతం ఉగ్రవాదులపై ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్ర వాయిదా పడిన సంగతి తెలిసిందే. యాత్ర వాయిదా అనంతరం ఉగ్రవాదులపై ఈ ఆపరేషన్ ప్రారంభించాయి భద్రతా దళాలు.
READ MORE: Boiler Blast: అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో పేలిన బాయిలర్.. 15 మందికి తీవ్రగాయాలు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
మొదట జరిగిన ఎన్ కౌంటర్ లో పారా కమాండో లాన్స్ నాయక్ ప్రదీప్ నైన్ వీరమరణం పొందారు. దీంతో ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. రెండో ఎన్కౌంటర్ ఫ్రిసల్ చినిగామ్ గ్రామంలో జరిగింది. ఈ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉండవచ్చని భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ ఆపరేషన్‌లో 1వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన హవల్దార్ రాజ్ కుమార్ వీరమరణం పొందారు. గ్రామానికి చేరుకోగానే.. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు అకస్మాత్తుగా భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల తీవ్రత పెరిగింది. ప్రస్తుతం ఇంకా రెండు చోట్ల భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీకే బిర్ధి ఎన్కౌంటర్ ప్రదేశాలను సందర్శించి, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?