విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే.. నేడు భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. మూలా నక్షత్రం కావటంతో పెద్దఎత్తున ఇంద్రకీలాద్రికి భక్తులు తరలివస్తున్నారు. వినాయకగుడి నుండి చిన్నరాజగోపురం వరకు భక్తులతో క్యూ లైన్స్ కిక్కిరపోయాయి. అర్దరాత్రి నుండే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శరన్నవరాత్రుల్లో భాగంగా నేడు దుర్గమ్మ సరస్వతిదేవిగా దర్శనమిస్తున్నారు. అయితే.. నేడు అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో లక్షలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి వద్ద నుండి 27 కంపార్ట్మెంట్ లు ఏర్పాటు చేసి భక్తులను పోలీసులు దర్శనాలకు వదులుతున్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో.. 5 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా.. మూలా నక్షత్రం కావటంతో నేడు ఇంద్రకీలాద్రి వైపుగా ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతన్నాయి. వైజాగ్ నుంచి చెన్నయ్ వెళ్ళేవి హనుమాన్ జుంక్షన్ వద్ద ,చెన్నై వెళ్ళేవి బాపట్ల వైపు…హైద్రాబాద్ వెళ్ళేవి ఇబ్రహీంపట్నం వద్ద మల్లింపు.. హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చే వాహనాలు సితార,సీవీఆర్ ఫ్లయ్ ఓవర్ మీదుగా మల్లింపు.. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు తోవగుంట వద్ద మల్లిస్తున్నారు.
అయితే.. మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం జగన్. మధ్యాహ్నం 3 గం.లకు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్ రానున్నారు. సీయం రాక సందర్బంగా దుర్గగుడిని అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు… అన్ని వీఐపీ దర్శనాల రద్దు చేసి కేవలం సర్వదర్శనాలను అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఎన్టీవీ తో ఆలయ ఈఓ భ్రమరాంబ మాట్లాడుతూ.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శన సమయాన్ని పెంచామని, ఎలాంటి వీఐపీ దర్శనాలకు అనుమతి లేదు అన్ని క్యూ లైన్స్ ఉచితమేనన్నారు. నేడు సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అరగంట దర్శనాలు నిలిపేస్తామన్నారు. తెల్లవారు జాము నుండి దర్శనాలకు భక్తులు తరలి వచ్చారని, 2 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు.