Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదులు అస్సాం రైఫిల్స్ సైనికులు ప్రయాణిస్తున్న ట్రక్కుపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. నలుగురు గాయపడ్డారు. రాజధాని ఇంఫాల్ శివారులో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఇంఫాల్ ఎయిర్ పోర్టు నుంచి 8 కి.మీ దూరంలో ఉనన నంబోల్ సబల్ లైకై ప్రాంతంలో, ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్ ప్రయాణిస్తున్న పారామిలిటరీ దళాల వాహనంపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పులు జరిపినట్లు సైన్యం కూడా ధ్రువీకరించింది.
Manipur: మణిపూర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఆ రాష్ట్రంలో గత రెండేళ్లుగా కొనసాగుతున్న హింసనను అడ్డుకుని, శాంతిభద్రతలను పునరుద్ధరించే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాష్ట్రంలోని 5 లోయ ప్రాంత జిల్లాల్లో నిర్వహించిన ఆపరేషన్లలో భారత ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Minister Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ఈశాన్య భారత పర్యటన సందర్భంగా శనివారం (మార్చి 15) మిజోరాంలో ఓ ప్రత్యేక క్షణాన్ని ఆస్వాదించారు. మిజోరాంకు చెందిన ఏడేళ్ల గాయనీ ఎస్తేర్ లాలదుహావమీ హనామ్తే పాటకు కేంద్రమంత్రి అమిత్ షా మంత్రముగ్ధుడయ్యాడు. దింతో ఆ చిన్నారికి గిటార్ ను బహుకరించారు. ఈ సందర్భంగా, అమిత్ షా తన అధికారిక X (Twitter) ఖాతాలో వీడియోను షేర్ చేస్తూ.. భారతదేశం పట్ల ప్రేమ మనందరినీ కలిపే…
మణిపూర్‌లో కుకీల హింసాకాండ కొనసాగుతోంది. జిరిబామ్ జిల్లాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం (నవంబర్ 11న) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడి తర్వాత వారు ఆరుగురిని కిడ్నాప్ చేశారు. బోరోబెక్రా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్‌పిఎఫ్ పోస్ట్‌పై కుకీల హింసాత్మక దాడి తర్వాత నుంచీ ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదు. వారిని కుకీ ఉగ్రవాదులే ఎత్తుకుపోయారని పోలీసులు భావిస్తున్నారు.
మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అసోం రైఫిల్స్ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు ఉన్న కోరిక గురించి వివరించారు. తాను కూడా సైన్యంలో చేరాలని అనుకున్నానని, అయితే తన కుటుంబంలోని ఇబ్బందుల కారణంగా కుదరలేదని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు.
నాగాలాండ్‌లోని నోక్లక్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున అస్సాం రైఫిల్స్ జవాన్లపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇండో-మయన్మార్ సరిహద్దులో ఉన్న డాన్ పాంగ్షా ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదులు, అస్సాం రైఫిల్స్ సిబ్బంది మధ్య కాల్పులు జరిగినట్లు నోక్లక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ హియాజు మేరు తెలిపారు.
సాయుధ దళాలలో 84,659 ఖాళీలు ఉన్నాయని.. డిసెంబర్ 2023 నాటికి సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) మరియు అస్సాం రైఫిల్స్‌లో ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలియజేసింది.