Huawei Pura 80 Series: మాస్టర్ ప్లాన్ వేసిన హువావే.. ఒకేసారి నాలుగు మొబైల్స్ లాంచ్..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huawei Pura 80 Series: చైనా టెక్ దిగ్గజం హువావే తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్ అయిన Huawei Pura 80 సిరీస్‌ను అధికారికంగా భారత కాలమానం ప్రకారం జూన్ 11న మధ్యాహ్నం12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ తమ అధికారిక Weibo అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ ఈవెంట్ లో ఏకంగా Huawei Pura 80 సిరీస్‌లో నాలుగు వేరియంట్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో Huawei Pura 80, Huawei Pura 80 Pro, Huawei Pura 80 Pro+, Huawei Pura 80 Ultra మోడల్స్ విడుదల కానున్నట్లు సమాచారం.
Read Also: Virat Kohli: ఈ విజయం ఆర్సీబి అభిమానులకు అంకితం.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్..!
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఇవి గతంలో విడుదలైన Pura 70 సిరీస్ మాదిరిగానే వేరియంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇతర ఫీచర్లను కంపెనీ ఇంకా వెల్లడించకపోయినప్పటికీ, అనేక లీక్‌లు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. ప్రసిద్ధ కంపెనీల నివేదికల ప్రకారం ఈ సిరీస్ ఫోన్ల వీడియో రికార్డింగ్ సామర్థ్యం చాలా బాగుంటుందని సమాచారం. వీటిలో అత్యాధునిక కెమెరా సెటప్ ఉండబోతుందన్న సంకేతంగా భావించవచ్చు.
నివేదిక ప్రకారం ప్యూరా 80 కెమెరా స్పెసిఫికేషన్లను షేర్ చేశారు. అందులోని వివరాల ప్రకారం.. 1-ఇంచ్ 50MP ప్రైమరీ సెన్సార్ (వేరియబుల్ అపర్చర్‌తో), 1/1.3-ఇంచ్ 50MP సెన్సార్ (డ్యుయల్ ఫోకల్ లెన్స్‌తో), 40MP అల్ట్రా వైడ్ షూటర్, 2MP కలర్ టెంపరేచర్ సెన్సార్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ హైఎండ్ కెమెరా సెటప్ Pro+ లేదా అల్ట్రా వేరియంట్ లో ఉండే అవకాశముంది. లీకైన పిక్చర్ ప్రకారం.. కెమెరా మాడ్యూల్ ట్రైయాంగిల్ ఆకృతిలో ఉండి పక్కన పిల్-షేప్ LED ఫ్లాష్ యూనిట్ ఉంటుంది.
గతంలో వచ్చిన Huawei Pura 70 Ultra వేరియంట్‌లో కూడా 1-ఇంచ్ రిట్రాక్టబుల్ కెమెరా, వేరియబుల్ అపర్చర్, 50MP మాక్రో టెలిఫోటో కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్యూరా 80 సిరీస్ కూడా అదే స్థాయిలో మరింత అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా హువావే ప్యూరా 80 సిరీస్ లాంచ్‌ను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టెక్ ప్రియులు. కొత్త కెమెరా ఫీచర్లు, హార్మోనీOS 5.0 వంటివి ఈ సిరీస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం ఉంది. జూన్ 11న అధికారికంగా ఎలాంటి సర్ప్రైజ్ ఫీచర్లు బయట పడతాయో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!