Site icon NTV Telugu

Pawan Kalyan: ఇంకా వీరమల్లును వదలని పవన్..

Pawan Kalyan Hhvm Event

Pawan Kalyan Hhvm Event

పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మాతగా రూపొందిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. నిజానికి ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలోనే మొదలైంది. అనేక ఆటంకాల కారణంగా ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సినిమా ఆగిపోతుందనుకున్న క్రమంలో ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సినిమాను పూర్తి చేశారు. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే సినిమా మీద నమ్మకంతో పాటు ఈ రోజు అమావాస్య కావడంతో ఒక రోజు ముందుగానే సినిమాను రిలీజ్ చేశారు ప్రీమియర్ ద్వారా. అయితే ప్రీమియర్ టాక్ కాస్త మిక్స్‌డ్ వచ్చింది.

READ MORE: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్‌బై చెబుతారా..? క్లారిటీ ఇచ్చిన పవర్ స్టార్..

చాలామంది బాగుందంటుంటే, అంతే మంది బాగోలేదని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చివరి రెండు రోజుల్లో మీడియా ముందుకు వచ్చిన క్రమంలో ఈ సినిమా మీద అందరి దృష్టి పడింది. ఒక్కసారిగా అందరూ సినిమా చూడాలని ఆసక్తి కనబరిచారు. అయితే సినిమా రిలీజ్ అయిపోయిందని ఊరుకోకుండా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు సోషల్ మీడియాలో మెసేజ్‌లు షేర్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు ఏకంగా సక్సెస్ మీట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లోని సక్సెస్ మీట్‌కి కూడా హాజరు కాబోతున్నారు. హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌కి అమరావతి నుంచి ఆయన క్యాబినెట్ సమావేశం ముగించుకుని బయలుదేరి వచ్చారు. ఈ రోజుల్లో ఒకే ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హాజరై తమ పని తాము చేసుకుంటున్న హీరోలకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక మంచి ఉదాహరణ సెట్ చేశారని చెప్పొచ్చు.

READ MORE: Piaggio Electric Auto: పియాజియో నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 236KM రేంజ్

Exit mobile version