జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాగా డాన్స్ చేస్తాడో మనందరికీ తెలుసు. అలాగే హృతిక్ రోషన్ ఎంత బాగా డాన్స్ చేస్తాడో కూడా తెలుసు. వీరిద్దరితో కలిసి ఒక సినిమా చేస్తున్నారనగానే అందరూ ఇలాంటి ఒక డాన్స్ నెంబర్ ఉంటుందని అనుకున్నారు. అయితే వార్ సినిమా కావడంతో ఆ డాన్స్ నెంబర్‌కి స్కోప్ ఎక్కడ దొరుకుతుందా, అసలు అలాంటిదేమైనా ప్లాన్ చేశారో లేదో అని అనుకున్నారు. కానీ ఫైనల్‌గా ఆ డాన్స్ నెంబర్ ఉందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పేశాడు.…
పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మాతగా రూపొందిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. నిజానికి ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలోనే మొదలైంది. అనేక ఆటంకాల కారణంగా ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సినిమా ఆగిపోతుందనుకున్న క్రమంలో ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సినిమాను పూర్తి చేశారు. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే సినిమా…