Bollywood : భారతదేశంలో బాలీవుడ్ చిత్రపరిశ్రమే పెద్దదని అంటుంటారు. హాలీవుడ్ స్ఫూర్తితో సినిమాలను తెరకెక్కించడంలో అక్కడి ఫిలిం మేకర్స్ ఎప్పుడూ ముందుంటారు. క్రిష్ సిరీస్ కానీ, ధూమ్ ఫ్రాంఛైజీ కానీ, రేస్ సిరీసులు కానీ హాలీవుడ్ స్ఫూర్తితోనే రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్లను సాధించారు. కానీ ఇటీవలి కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివిటీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందీ చిత్రసీమలో ప్రధాన స్టార్లు అందరూ కేవలం రీమేక్ లపై ఆధారపడుతున్నారు కానీ, తమ దర్శకులు చెప్పే ఒరిజినల్ స్క్రిప్టుల్లో నటించేందుకు ఏమాత్రం ఆసక్తిని కనబరచడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి హీరోల్లో చిన్న వాళ్ల నుంచి ఖాన్ త్రయం వరకు చాలా మందే ఉన్నారు.
Read Also:KTR Open Letter: ఎందుకు మౌనంగా ఉన్నారు?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ..
ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ తదుపరి విల్ స్మిత్ నటించిన ఐ యామ్ లెజెండ్ రీమేక్ లో నటిస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఐ యామ్ లెజెండ్ హాలీవుడ్ లో రెండు దశాబ్ధాల క్రితమే విడుదలై సంచలనం సృష్టించిన మాస్టర్ పీస్. విల్ స్మిత్ నటన న భూతో న భవిష్యత్ అన్న విధంగా ఉంటుంది. ఒక దీవిని వైరస్ ఆక్రమించిన తర్వాత మనుషులంతా ఆ వైరస్ కి గురై, వికృత రూపాలలోకి మారి ఏ చేస్తారనేది ఈ సినిమా కథ. అలాంటి చోటి నుంచి తప్పించుకున్న మనుషులు వైరస్ భారిన పడకుండా తమ ప్రాణాలను దక్కించుకోవడమెలా? అన్నది తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.
Read Also:Vijay Sethupathi : ఫాన్సీ రేటు ‘విడుదల – 2’ తెలుగు థియేట్రికల్ రైట్స్..
అయితే ఇలాంటి జాంబీ తరహా కథను ఎంచుకుని హృతిక్ లాంటి స్టార్ హీరో కూడా మళ్లీ నటించాలా అన్న సందేహాలు పుట్టుకొస్తున్నాయి. అతడు ఒరిజినల్ స్క్రిప్టుతో రూపొందించే క్రిష్ 4 కి ప్రాధాన్యత ఇవ్వడమే ఉత్తమం కదానే అభిప్రాయమూ లేకపోలేదు. ఇక ఐయామ్ లెజెండ్ కి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. ఇటీవల అక్షయ్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్లు రీమేక్ లతో తీవ్ర నష్టాలను చవి చూశారు. అందుకే హృతిక్ ఈ విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.