Vijay Sethupathi : ఫాన్సీ రేటు ‘విడుదల – 2’ తెలుగు థియేట్రికల్ రైట్స్..
- వెట్రి మారన్ దర్శకత్వంలో వస్తున్న విడుదల - 2
- తెలుగు థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన చింతపల్లి రామారావు
- డిసెంబర్ 20న విడుదలకు ప్లానింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళంలో లాస్ట్ ఇయర్ సంచలన విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం విడుదల. విజయ్ సేతుపతి పెర్ఫార్మన్స్ హైలెట్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా అతి త్వరలో “విడుదల2” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఎంతోమంది నిర్మాతలు పోటీ పడగా, ఫాన్సీ రేట్ తో ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు.
Also Read : Harsha Sai : ఎట్టకేలకు హైదరాబద్ కు యూట్యూబర్ హర్ష సాయి..
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ ” విడుదల – 2 చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్ గా మా సినిమా ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది. అలాగే ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రీ మారన్, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్ ఇన్ఫో టైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్ తో కలిసి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్రాన్ని మేము దక్కించుకున్నందుకు సంతోష పడుతున్నాం. విడుదల – 2 తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. డిసెంబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని రామారావు పేర్కొన్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సూరిలతో పాటు మలయాళ నటి మంజుల వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరియు భవాని శ్రీ వంటి ప్రతిభావంతులైన తారాగణం ఉన్నారు, వేల్ రాజ్ ఛాయాగ్రహణం మరియు ఇళయరాజా సంగీతం అందించారు, వెట్రి మారన్ దర్శకత్వం వహించారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!