Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tips How To Get Rid Of Ants Naturally Summer Home Remedies Telugu

Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో చెక్ పెట్టండి!

Published Date :April 9, 2026 , 7:37 pm
By Shiva Ganesh
Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో చెక్ పెట్టండి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Summer Tips: ఎండలు ముదురుతుండటంతో ఇళ్లలో చీమల వరుసలు ఎక్కువ అవుతాయి. వేసవి తాపం మనుషులకే కాదు, చీమలకు కూడా ఎక్కువే. అందుకే చల్లదనం కోసం, ఆహారం కోసం అవి మన ఇళ్లపై దండెత్తుతుంటాయి. తీపి పదార్థాలే కాదు.. బట్టలు, సోఫాలు, చివరకు పడుకునే మంచాలపైకి కూడా ఇవి చేరుతూ ఇబ్బంది పెడుతుంటాయి. నిజానికి చీమలు కుట్టినప్పుడు వాటిలోని ఫార్మిక్ యాసిడ్ వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వస్తాయి. దీంతో వాటి పని పట్టడానికి చాలా మంది మార్కెట్లో దొరికే కెమికల్ చాక్ పీసులు లేదా స్ప్రేలు వాడటం చేస్తున్నారు. అయితే ఇవి వాటడం వల్ల చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి వాటి అవసరం లేకుండా, మీ వంటింట్లో ఉండే సహజ సిద్ధమైన వస్తువులతోనే చీమలను శాశ్వతంగా ఎలా తరిమికొట్టాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..

సింపుల్ టిప్స్ ఇవే..
చీమలను తరిమికొట్టడంలో వైట్ వెనిగర్ తిరుగులేని ఆయుధం. దీనిని ఎలా వాడాలంటే.. సమాన పాళ్లలో వెనిగర్, వాటర్‌ను కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో తీసుకోవాలి. తర్వాత నిత్యం చీమలు తిరిగే ప్రదేశాల్లో దీనిని చల్లండి. ఇలా చేస్తే ఏమౌతుందంటే.. వెనిగర్ ఘాటైన వాసన వల్ల చీమలు వాటి దారిని కనిపెట్టే ‘ఫేర్మోన్’ సంకేతాలను కోల్పోతాయి. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపినా మంచి ఫలితం ఉంటుంది. అలాగే చీమలకు మిరియాల పొడి లేదా ఎర్ర కారం ఘాటు అంటే అస్సలు పడదు. చీమలు లోపలికి వచ్చే రంధ్రాల వద్ద కాస్త ఎర్ర మిరప పొడిని గానీ లేదా నల్ల మిరియాల పొడిని గానీ చల్లండి. లేదంటే మిరియాల పొడిని కొంచెం నీటిలో కలిపి స్ప్రే చేసినా అవి వెంటనే పారిపోతాయి.

చీమలను చంపడానికి ఒక నాచురల్ ‘ట్రాప్’ బేకింగ్ సోడా – చక్కెర లిక్వీడ్. సమాన పాళ్లలో ఐసింగ్ షుగర్ (పొడి చక్కెర), బేకింగ్ సోడాను కలిపి చీమలు వచ్చే మూలల్లో ఉంచండి. చక్కెర వాసనకు ఆకర్షితమై చీమలు దీన్ని తింటాయి. బేకింగ్ సోడా వాటి శరీరంలోకి వెళ్లగానే రసాయనిక చర్య జరిగి చీమలు చనిపోతాయి. మనం గిన్నెలు కడగడానికి వాడే డిష్ వాష్ లిక్విడ్ కూడా చీమల నివారణకు ఉపయోగపడుతుంది. దీనిని నీటిలో కలిపి స్ప్రే చేయడం వల్ల చీమల శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో ఆ ప్రదేశానికి అవి మళ్లీ రావు. కేవలం చిట్కాలు పాటించడమే కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే చీమలు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. పాలు, జ్యూస్ లేదా పంచదార వంటి పదార్థాలు కింద పడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తుడిచేయాలి. గోడల మధ్య లేదా తలుపుల సందుల్లో ఉన్న పగుళ్లను వైట్ సిమెంట్ లేదా పుట్టీతో మూసివేయండి. దీనివల్ల చీమలు లోపలికి రావడానికి దారి ఉండదు. వేసవిలో చీమలు చల్లదనం కోసం తేమ ఉన్న ప్రదేశాలకు వస్తుంటాయి. అందుకే కిచెన్ సింక్, బాత్‌రూమ్ పరిసరాల్లో నీరు నిలవకుండా పొడిగా ఉంచండి. ఈ చిట్కాలు పాటిస్తే ఎటువంటి ప్రమాదకరమైన కెమికల్స్ వాడకుండానే మీ ఇంటిని చీమల రహితంగా మార్చుకోవచ్చు.

READ ALSO: Bangladesh Cricket: స్టేడియంలో కాఫీ ఖర్చంత కూడా లేని ఆ దేశ స్టార్ ప్లేయర్ల జీతాలు..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ants
  • Baking Soda
  • Home Remedies
  • Kitchen Secrets
  • Natural Hacks

తాజావార్తలు

  • Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో చెక్ పెట్టండి!

  • Sunil Gavaskar: వైభవ్ సూర్యవంశీ సిక్సులు కొడుతుంటే చూడలేకపోయా.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..

  • KTR : జీవన్ రెడ్డి BRSలోకి… కేటీఆర్ హాట్ కామెంట్స్

  • Bangladesh Cricket: స్టేడియంలో కాఫీ ఖర్చంత కూడా లేని ఆ దేశ స్టార్ ప్లేయర్ల జీతాలు..!

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions