Bangladesh Cricket: స్టేడియంలో కాఫీ ఖర్చంత కూడా లేని ఆ దేశ స్టార్ ప్లేయర్ల జీతాలు..!
- బంగ్లాలో ఒక మ్యాచ్ ఫీజు రూ.750
- గంటల్లోనే జీతాలు పెంచుతూ సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది. ఆ దేశ స్టార్ క్రికెటర్, ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) తాత్కాలిక కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తమీమ్ ఇక్బాల్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశీయ క్రికెటర్లు, ముఖ్యంగా మహిళా క్రీడాకారులు అందుకుంటున్న అత్యల్ప జీతాలు చూసి ఆయన దిగ్భ్రాంతి చెందారు. వెంటనే ఆయన క్రీడాకారులు అందుకుంటున్న జీతాలు, మ్యాచ్ ఫీజులను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
READ ALSO: Rashid Khan: వెన్ను గాయం వెంటాడుతోంది.. డాక్టర్లు హెచ్చరించారు.. అయినా కానీ..?
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
రూ.750 కే మ్యాచ్ ఆడుతున్నారా..
ఇటీవల బాధ్యతలు చేపట్టిన తమీమ్ ఇక్బాల్ బోర్డు రికార్డులను పరిశీలిస్తున్నప్పుడు ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక మహిళా క్రికెటర్‌కు వన్డే మ్యాచ్ ఆడినందుకు కేవలం 1000 టాకాలు (సుమారు రూ.750) మాత్రమే చెల్లిస్తున్నారని తెలిసి ఆయన మైండ్ బ్లాక్ అయ్యింది. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న దేశంలో ఇలాంటి వివక్ష ఏంటని ప్రశ్నించిన ఆయన, వెంటనే మహిళా క్రికెటర్ల ఫీజులను సవరించారు. మహిళా క్రికెటర్ల కొత్త ఫీజులు ఇవే.. వన్డే మ్యాచ్‌కు 15,000 టాకాలు, ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌కు 20,000 టాకాలు, టీ20లకు 10,000 టాకాలుగా నిర్ణయించారు. అలాగే టాప్ 36 మంది మహిళా క్రీడాకారిణుల నెలవారి జీతాన్ని 30,000 నుంచి 40,000 టాకాలకు పెంచారు.
మహిళలతో పాటు పురుష దేశీయ క్రికెటర్లకు కూడా తమీమ్ తన నిర్ణయంతో ఊరటనిచ్చారు. కేటగిరీ ‘ఎ’ ఆటగాళ్ల జీతాన్ని 65,000 టాకాలకు పెంచగా, బి, సి కేటగిరీలకు వరుసగా 50 వేలు, 40 వేల టాకాలు పెంచారు. ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఫీజు విషయానికి వస్తే.. గతంలో ఉన్న 70,000 టాకాలను ఏకంగా 1,00,000 టాకాలకు (సుమారు రూ. 75,000) పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. “గత మూడు, నాలుగు ఏళ్లుగా ఆటగాళ్ల జీతాల్లో ఎలాంటి మార్పు లేదు. వారికి చెల్లిస్తున్న వేతనం చాలా తక్కువ. క్రికెట్ అనేది ఆటగాళ్ల కష్టం మీద ఆధారపడి ఉంటుంది, వారికి సరైన గౌరవం, వేతనం అందాలి. ప్రస్తుత పెంపు ఇంకా ఆదర్శవంతంగా లేకపోయినా, ఇది ఒక మంచి ఆరంభం మాత్రమే” అని పేర్కొన్నారు. గత ఏడాదిన్నర కాలంలో బీసీబీ ప్రతిష్ట దెబ్బతిందని అంగీకరించిన తమీమ్, బోర్డులో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పారు. క్రికెట్ ఎప్పుడూ దేశానికి గర్వకారణంగా ఉండాలని, బోర్డులో పని చేసే ప్రతి ఒక్కరూ ఆ గర్వంతో పని చేయాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు ఉంటాయని హింట్ ఇచ్చారు. నిజానికి గతంలో బంగ్లా క్రీకెటర్ అందుకున్న రూ.750 తో స్టేడియంలో కాఫీ కూడా రాదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా తమీమ్ ఇక్బాల్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని విశ్లేషకులు స్వాగతించారు.
READ ALSO: Dacoit: రేపే థియేటర్స్‌లోకి డెకాయిట్.. అప్పుడే గూఢచారి 2 పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన శేష్!
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!