Maruti Suzuki Swift: మారుతీ సుజుకీ స్విఫ్ట్ కి ఎందికింత ఆదరణ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ రోడ్లపై ఎక్కువగా కనిపించే వాహనాలలో సుజుకీ స్విఫ్ట్ ఒకటి. ఈ కంపెనీకి చెందిన వాహనంపై మన దేశంలో ఆదరణ ఎక్కువగా ఉంది. లాంచ్ అయిన 19 ఏళ్లకు కూడా మారుతీ సుజుకీ స్విఫ్ట్ సేల్స్ పరంగా దసుకుపోతోంది. ఆటోమొబైల్ మార్కెట్ఎంత మారినా, ఎస్‌యూవీలు ఎంతలా దండయాత్ర చేసినా ఆ వాహనం డిమాండ్ తగ్గడం లేదు. బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా రాణిస్తోంది మారుతీ సుజుకీ స్విఫ్ట్. ఎఫ్వై 2023-24లో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. మరి ఈ వాహనాన్ని ఎందుకంతలా ఇష్ట పడుతున్నారంటే.. మారుతీ సుజుకీ స్విఫ్ట్ 2005లో తొలిసారి భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. గత ఆర్థిక ఏడాదిలో 1,95,321 యూనిట్లు అమ్ముడుపోయాయి. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగో వంటి మోడల్స్ నుంచి స్విఫ్ట్ కు గట్టి పోటీ ఎదురైంది. అయినా స్విఫ్ట్ సేల్స్ పరంగా దూసుకుపోతోంది.
Peddireddy Ramachandra Reddy: 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే..READ MORE:
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ప్రధాన కారణాలు.. డిజైన్- లుక్స్, వాల్యూ ఫర్ మనీ ఫీచర్స్, ఫ్యుయెల్ ఎఫీషియెన్సీ. తొలినాళ్లలో మారుతీ సుజికీ స్విఫ్ట్నయా డిజైన్‌తో ట్రెండ్‌సెట్ చేసింది. హై క్వాలిటీ మెటీరియల్‌తో స్పెషియస్ కేబిన్ఆకట్టుకుంది. కాక్‌పిక్ తరహా గ్లాస్ హౌజ్, వైడ్ హిప్స్, స్క్వేర్ బేస్ వంటి డిజైన్ ఎలిమెంట్స్.. అందరిని అబ్బురపరిచింది. మారుతీ సుజుకీ లైనప్‌లో స్విఫ్ట్‌కి.. వాల్యూ ఫర్ మనీ మోడల్ అని పేరు ఉంది. స్విఫ్ట్‌కి రీసేల్ వాల్యూ కూడా అధికంగా ఉండటం.. మరో హైలైట్. అంటే.. మార్కెట్‌తో పోల్చితే.. తక్కువ ధరకే మంచి ఫీచర్స్ ఉన్న స్విఫ్ట్ కారు కొనుక్కుని.. విక్రయించేడప్పుడు.. కాస్త మెరుగైన రీసేల్ వాల్యూ కూడా పొందొచ్చు. ఈ మధ్య వస్తున్న వాహనాల్లో ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ పెద్దగా ఉండట్లేదు. కానీ ఈ విషయంలో మారుతీ సుజుకీ ఒక మెట్టు పైనే ఉంటుంది. ఇక మారుతీ సుజుకీ స్విఫ్ట్‌లోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్.. 22.38 కేఎంపీఎల్ మైలేజ్‌ని ఇస్తుంది. ఇందులో 1.2 లీటర్ సీఎన్జీ ఇంజిన్.. 30.9 కేఎంపీకేజీ మైలేజ్ ఇస్తుంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!