NTV Telugu Site icon

Asia Cup 2023 Final: టైటిల్ గెలిచిన టీమిండియాకు ప్రైజ్మనీ ఎంతంటే..?

Prize Money

Prize Money

2023 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించి ఐదేళ్ల తర్వాత భారత జట్టు ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఆసియా కప్ చరిత్రలో టీమిండియా ఎనిమిదోసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియాకు కూడా భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Payal Ghosh: ఎన్టీఆర్ హీరోయిన్ ఏంట్రా.. ఈ రేంజ్ లో చూపిస్తోంది.. దేవుడా..

ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టును 50 పరుగులకే పరిమితం చేయడంలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం 6.1 ఓవర్లలోనే సాధించింది. ఆ తర్వాత విజేతగా టీమిండియా 150,000 US డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో (కోటి 24లక్షల63వేల552.)ను ప్రైజ్ మనీగా అందుకుంది. రన్నరప్‌గా శ్రీలంక జట్టుకు ప్రైజ్ మనీగా US $ 75,000(62లక్షల31వేల776) అందుకుంది.

Asia Cup 2023: ఫైనల్లో గెలవడంపై టీమిండియాపై అభినందనల వెల్లువ

2023 ఆసియా కప్‌లో భారత జట్టు బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనిపించారు. అందులో భాగంగానే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు, ఆ తర్వాత శ్రీలంకపై ముఖ్యమైన సమయాల్లో 4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ పేరు ముందంజలో ఉంది. దీంతో ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు కుల్దీప్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్ లభించింది. ఇందులో అతనికి 15,000 US డాలర్ల ప్రైస్ మనీ ఇచ్చారు.

Maadhavi Latha: బిగ్ బాస్ లో వాళ్లని పెడితే .. ఎవడు దేకను కూడా దేకడు

ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డుగా సిరాజ్ US $ 5,000 మొత్తాన్ని అందుకున్నాడు. దానిని అతను గ్రౌండ్స్‌మన్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) తరపున.. శ్రీలంక గ్రౌండ్స్‌మెన్‌కి అద్భుతమైన పనికి ప్రైజ్ మనీగా US $ 50,000 ఇచ్చారు.

Show comments