బాలీవుడ్ ‘మెగాస్టార్’ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న టెలివిజన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 16 కొనసాగుతోంది. సీజన్ 15 మాదిరిగానే 16కు కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌లను బిగ్‌బీ ఆసక్తికర ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఓ కంటెస్టెంట్ నుంచి అమితాబ్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు ఆయన ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Also Read: Siddharth-Aditi: పొద్దునే అదితి నా నుంచి దాన్ని లాగేసుకుంటుంది: సిద్ధార్థ్
న్యూ ఢిల్లీకి చెందిన రితికా కుమారి సింగ్ తాజాగా కేబీసీ 16 సీజన్‌లో పాల్గొన్నారు. హాట్ సీట్‌లో కూర్చొన్న రితికా.. ‘సర్ మీ దగ్గర చాలా రకాల సూట్స్ ఉంటాయి. మొత్తం మీ వద్ద ఎన్ని ఉన్నాయి’ అని అమితాబ్ బచ్చన్‌ను అడిగింది. ఆ ప్రశ్నకు అమితాబ్ నవ్వారు. ‘ఇది నా సూట్ కాదు. షోది. షో అయ్యాక దీన్ని ఇచ్చేయాలి. నా దగ్గర ఏ సూట్స్ లేవు. నా దగ్గర పైజమా, కుర్తాలు మాత్రమే ఉన్నాయి’ అని బిగ్‌బీ సమాధానం ఇచ్చారు. దాంతో షోలో ఉన్న వాళ్లందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ‘మీరు జర్నలిస్టు. నేను మీకు నమస్కరిస్తున్నాను. జర్నలిస్టును గౌరవించాలి’ అని అంతకుముందు రితికాతో అమితాబ్ అన్నారు. ఈ షో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సోనీలైవ్‌లో కూడా టెలికాస్ట్ అవుతుంది.