NTV Telugu Site icon

T20 World Cup 2024: న్యూయార్క్‌లో విపరీతంగా పెరిగిన హోట‌ల్ ధ‌ర‌లు.. కారణమేంటంటే..?

Hotles

Hotles

న్యూయార్క్‌లో హోట‌ల్ ధ‌ర‌లు ఆకాశన్నంటాయి. కారణమేంటంటే.. టీ20 వరల్డ్ కప్కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.. కాగా.. జూన్ 9వ తేదీన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ను లైవ్ లో చూడాలనుకునే ఫ్యాన్స్ ఎక్కువగానే ఉంటారు. దాయాదుల మధ్య పోరు అంటే.. ఏ దేశంలో జరిగినా, డబ్బులు లెక్క చేయకుండా వెళ్తారు.

Malavika Jayaram : ఘనంగా జయరామ్ కుమార్తె వివాహం ..ఫోటోలు వైరల్..

గతేడాది భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో ఇండియా-పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ లో జరిగింది. ఆ మ్యాచ్ కోసం.. అభిమానులు ఎంత పోటీ పడ్డారో తెలిసిందే.. మ్యాచ్ టికెట్లు దొరికిన వారు వారు ఉండేందుకు హోటల్స్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హోట‌ళ్లు అన్ని ఫుల్ కావడంతో హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేశాయి. అప్పుడు కూడా హోటల్స్ ధ‌ర‌లు కూడా ఆక‌శాన్నంటాయి. ఇప్పుడు కూడా న్యూయార్క్‌లో అలాంటి పరిస్థితి ఏర్పడింది.

Chandrasekhar: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేసింది..

ప్రస్తుతం అక్కడి హోట‌ళ్ల రేట్లు విపరీతంగా పెరిగాయి. కొన్ని హోట‌ళ్ల రేట్లు ఏకంగా 600 శాతం పెరిగిపోయాయి. ప్రస్తుతం న్యూయార్క్‌లోని కొన్ని హోట‌ళ్లలో రూమ్స్ ధ‌ర‌ రూ. 9,422గా ఉంటే.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రోజు ఈ ధ‌ర రూ. 66,624గా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీన్నిబ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు భార‌త్‌, పాక్ మ్యాచ్ క్రేజ్ ఏంటి అనేది. కాగా.. మరో 29 రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో ఈసారి 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ ఐసీసీ టోర్నీలో మొత్తం 55 మ్యాచులు ఉండనున్నాయి. జూన్ 2 నుంచి 29వ తేదీ వ‌ర‌కు టోర్నమెంట్‌ జ‌ర‌ుగ‌నుంది.