ఏపీలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వాతావరణం మారిపోయింది. ఈ రెండు పార్టీలకు విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం మరింత వేడిని రాజేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా బీజేపీ,బీఆరెస్ మధ్య చిచ్చు రాజుకుంది. భారతీయ రాష్ట్ర సమితి జెండాలను పీకి పారేసి బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రయివేటీకరణను నిలిపివేయించేందుకు కేంద్ర స్థాయిలో ఏడాదిగా ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు బీఆరెస్ హడావుడి చేస్తోందనేది ఆగ్రహం. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోటచంద్ర శేఖర్ విశాఖకు వచ్చిన సమయంలో బీఆర్ ఎస్ నగరంలోని ప్రధాన కూడళ్లలో జెండాలు, ఫ్లేక్సీలు కట్టింది. స్టీల్ ప్లాంట్ పరిసరాలను గులాబీ జెండాలతో నింపేసింది.
Read Also: Current Subsidy : రాజధానివాసులకు షాక్..నేటితో ముగియనున్న కరెంట్ సబ్సిడీ
సాధారణంగా రాజకీయ పార్టీల జెండాలను కార్యక్రమం ముగిసిన తర్వాత నిర్వాహకులు కానీ జీవీఎంసీ కానీ తొలగిస్తుంటాయి. అయితే, బీఆరెస్ జెండాలు విషయంలో ఆ విధంగా జరగలేదు. ఇవాళ ఎంపీ జీవీఎల్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో సమావేశం అయ్యారు. పార్టీ నాయకులతో కలిసి ఆ వివరాలను మీడియాకు చెప్పారు. ప్రెస్మీట్ ముగించుకుని జీవీఎల్ వెళ్లిన తర్వాత బిజెపి నాయకులు రోడ్డెక్కారు. స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో కట్టిన జెండాలను పీకేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు మళ్లీ జెండాలను యథాస్థానంలో ఉంచారు.
Read Also: Prema: సౌందర్య తల లేదు.. మొండెం మాత్రమే ఉంది.. వాచ్ చూసి
బాధ్యులైన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు దువ్వడా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. అటు.,ఎంపీ జీవీఎల్ ఇంటిని ముందు ఆందోళనకు సిద్ధం అని బీఆర్ఎస్ ప్రకటించడం వేడిని రాజేసింది…బీజేపీ కార్యకర్తలు తొలగించిన పార్టీ జెండాలను తిరిగి కడుతున్నారు బీఆర్ ఎస్ నాయకులు….జెండాలు పీకేసిన వాళ్ళపై పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉంది బీఆర్ఎస్. దీంతో తెలంగాణలో తరహా రాజకీయం ఏపీలోనూ కనిపిస్తోంది. అక్కడ బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక్కడ మాత్రం రెండు విపక్ష పార్టీలు విమర్శలతో హోరెత్తిస్తున్నాయి.