HONOR X70: హానర్ కంపెనీ చైనా మార్కెట్లో తన తాజా స్మార్ట్‌ఫోన్ HONOR X70 ను అధికారికంగా ప్రకటించింది. ఈ మొబైల్ లో ఉన్న 8300mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ దీన్ని ప్రత్యేకంగా మారుస్తోంది. ఇది సగటు 6 సంవత్సరాల పాటు బ్యాటరీ పనితీరును నిలుపుకుంటుందని కంపెనీ చెబుతోంది. మరి ఈ కొత్త హానర్ X70 మొబైల్ పూర్తి వివరాలు ఒకసారి చూసేద్దాం..
HONOR X70లో 6.79 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే (2640×1200 pixels) ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3840Hz PWM డిమ్మింగ్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఫోన్ Snapdragon 6 Gen 4 (4nm) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB/12GB ర్యామ్, 128GB నుంచి 512GB వరకు వివిధ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో 8300mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, ప్రత్యేకంగా 512GB వేరియంట్‌లో 80W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ వెయిట్ కేవలం 199 గ్రాములు మాత్రమే. అలాగే మందం 8mm కంటే తక్కువగా ఉంది.

హానర్ X70 ప్రపంచంలోనే మొదటిసారిగా IP69K రేటింగ్‌ను పొందిన స్మార్ట్‌ఫోన్. ఇది బాయిలింగ్ వాటర్, హై ప్రెషర్ వాటర్ గన్ ను తట్టుకుని పనిచేయగలదు. అంతేకాదు, AI రెయిన్‌టచ్, గ్లోవ్ టచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొత్తగా రూపొందించిన బుల్లెట్‌ప్రూఫ్ వెస్ట్ స్ట్రక్చర్, 2.5 మీటర్ల డ్రాప్ రెసిస్టెన్స్ దీన్ని మరింత భద్రతా ప్రాముఖ్యత గల ఫోన్‌గా నిలబెట్టింది. ఇక ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 8MP సెల్ఫీ కెమెరా, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, స్టీరియో స్పీకర్లు, USB Type-C ఆడియో, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ వంటి ఇతర ఫీచర్లూ ఉన్నాయి. 5G సపోర్ట్‌తో పాటు Wi-Fi 6, Bluetooth 5.3, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS (L1+L5), NFC వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

HONOR X70 చిన్నబార్ రెడ్, బాంబో గ్రీన్, మూన్ వైట్, మిడ్ నైట్ బ్లాక్ అనే నాలుగు రంగుల్లో లభించనుంది. HONOR X70 స్మార్ట్‌ఫోన్‌ను నాలుగు వేరియంట్లలో విడుదల చేశారు. ప్రారంభ వేరియంట్ అయిన 8GB + 128GB మోడల్ ధర 1399 యువాన్, అంటే సుమారు రూ. 16,760గా ఉంది. ఇక 8GB + 256GB వేరియంట్ ధర 1599 యువాన్, అంటే దాదాపు రూ. 19,155గా ఉంది. ఇక మూడవ వేరియంట్‌గా 12GB + 256GB మోడల్‌ను కంపెనీ 1799 యువాన్స్ (సుమారు రూ. 21,550) అందిస్తోంది. టాప్ వేరియంట్ అయిన 12GB + 512GB ధర 1999 యువాన్ అంటే దాదాపు రూ. 23,950గా నిర్ణయించారు. ఈ ఫోన్లు జూలై 18 నుంచి చైనాలో అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి.