Mohammed Siraj: ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ భారత్‌కి చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఇకపోతే, ఈ మ్యాచ్ లో చివరి వికెట్ గా బౌల్డ్ అయిన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం భావోద్వేగంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. కేవలం 22 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయిన ఈ మ్యాచ్ అనంతరం, సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు. అదేంటంటే..
“కొన్ని మ్యాచ్‌లు ఫలితం కోసం కాకుండా, అవి మనకు నేర్పిన పాఠాల కారణంగా మనతోనే ఉంటాయి” అంటూ సిరాజ్ రాసిన ఈ పోస్ట్ లో తన ఎమోషన్ ను పంచుకున్నాడు. లార్డ్స్ టెస్ట్ మొత్తం హోరాహోరీగా సాగింది. రెండు జట్లు గెలుపుకోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరి రోజు లంచ్ సమయానికే ఎనిమిది వికెట్లు కోల్పోయిన భారత్, మూడో సెషన్‌లో కొంత పోరాడినప్పటికీ, చివరకు మహ్మద్ సిరాజ్ వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ ముగిసింది.
Read Also:Lowest total in Tests: టెస్టుల్లో అత్యల్ప స్కోర్ చేసిన చేసిన జట్లు ఇవే..!
ఈ సమయంలో ఇంగ్లాండ్ బౌలర్లు తమ ఉత్తమ ప్రదర్శనను కనబరిచారు. భారత్ చివరి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ విఫలమవడంతో మ్యాచ్ వాళ్లవైపు మళ్లిపోయింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత జో రూట్, జాక్ క్రాలీ సిరాజ్ దగ్గరికి వచ్చి ఓదార్చిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. టెస్టు సిరీస్‌లో ఈ విజయంతో ఇంగ్లాండ్ జట్టు 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అయినప్పటికీ, భారత జట్టు ప్రదర్శనపై విమర్శలతో పాటు సపోర్టింగ్ వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ వేసిన స్పెల్‌లు, అతని ఎనర్జీ మ్యాచ్‌కి కొత్త ఉత్సాహం తీసుకువచ్చాయి. ఇక నాలగవ టెస్ట్ జులై 23 నుండి మొదలు కానుంది.