ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
- చైనాలో హానర్ మ్యాజిక్ 9 స్మార్ట్‌ఫోన్ లాంచ్
- ARRI కో-బ్రాండెడ్ డ్యూయల్ 200MP కెమెరా సెటప్
- 200MP మెయిన్, 200MP టెలిఫోటో, 50MP అల్ట్రా-వైడ్ కెమెరాలు
- 55MP సెల్ఫీ కెమెరా అందించిన హానర్
- 6.37 అంగుళాల OLED డిస్ప్లే, 10,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్
- 8,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ
- 80W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్
- ARRI LogC3, 87 ARRI లుక్ ప్రొఫైల్స్‌కు సపోర్ట్
- IP68, IP69, IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR Magic 9: హానర్ సంస్థ చైనాలో తన కొత్త మ్యాజిక్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో హానర్ మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మాక్స్, మ్యాజిక్ 9 సూపర్ ఎడిషన్ అనే మూడు మోడల్స్ ఉన్నాయి. ఇందులో మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మాక్స్ మోడల్స్‌లో ARRIతో కలిసి అభివృద్ధి చేసిన కెమెరా సిస్టమ్‌ను అందించారు. ముఖ్యంగా ప్రో మాక్స్ మోడల్లో 200MP మెయిన్ కెమెరాతో పాటు 200MP టెలిఫోటో కెమెరాను ఇచ్చారు.
డ్యూయల్ 200MP కెమెరాలు
హానర్ మ్యాజిక్ 9లో ARRI కో-బ్రాండెడ్ డ్యూయల్ 200MP కెమెరా సెటప్ ఉంది. ఇందులో 1/1.4-అంగుళాల సెన్సార్‌తో 200MP మెయిన్ కెమెరా, f/1.9 అపెర్చర్, CIPA 7.5 స్టెబిలైజేషన్‌తో వస్తుంది. ఇంకో 200MP టెలిఫోటో కెమెరాకు 1/1.56 అంగుళాల సెన్సార్, f/2.6 అపెర్చర్, CIPA 7.5 స్టెబిలైజేషన్ ఉన్నాయి. వీటికి 50MP అల్ట్రా-వైడ్ కెమెరా జతగా ఉంది. ముందువైపు 55MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఇది 1/2.74-అంగుళాల సెన్సార్, f/2.0 అపెర్చర్‌తో పాటు 1:1 స్క్వేర్ ఫుల్-ఫ్రేమ్‌ను సపోర్ట్ చేస్తుంది.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ARRI టెక్నాలజీ
మ్యాజిక్ 9లో 6nm హానర్ Yuguang H1 ఇమేజింగ్ చిప్‌ను ఉపయోగించారు. ఇది 18.8 TOPS/W సామర్థ్యంతో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. RAW డొమైన్లో లాస్‌లెస్ నాయిస్ రిడక్షన్‌కు ఈ చిప్ సహకరిస్తుంది. ARRI LogC3 పైప్‌లైన్ ద్వారా 87 అధికారిక ARRI లుక్ ప్రొఫైల్స్‌కు సపోర్ట్ లభిస్తుంది. ARRI LUT ఎకోసిస్టమ్‌లోని ఎన్విరాన్మెంట్-5220, కాంట్రాస్ట్-7120 వంటి ప్రొఫైల్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ARRI లైవ్ ఫోటో ఫీచర్ ద్వారా మూడు సెకన్ల 4K క్లిప్‌లను 2.39:1 సినిమాటిక్ యాస్పెక్ట్ రేషియోలో రికార్డ్ చేయవచ్చు.
200MP జూమ్-ఫ్లాష్ పోర్ట్రెయిట్, వేరియబుల్-ఫోకస్ ఫ్లాష్, AI కలర్ మ్యాచింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అదనంగా G200 టెలిఫోటో ఎక్స్‌టెండర్‌ను అందిస్తున్నారు. దీని బరువు 88 గ్రాములు, పొడవు 81mmగా ఉంది.
OLED డిస్ప్లే
హానర్ మ్యాజిక్ 9లో 6.37 అంగుళాల OLED డిస్ప్లే ఉంది. ఇది 1236 × 2664 పిక్సెల్స్ రిజల్యూషన్, 460ppi, DCI-P3 కలర్ గామట్, 1.07 బిలియన్ కలర్స్‌తో వస్తుంది. స్క్రీన్-టు-బాడీ రేషియో 95.6 శాతంగా ఉంది. 60Hz, 90Hz, 120Hz రిఫ్రెష్ రేట్లకు సపోర్ట్‌తో పాటు 3840Hz PWM డిమ్మింగ్, డాల్బీ విజన్, HDR వివిడ్, ZREAL వంటి ఫీచర్లు ఉన్నాయి. డిస్ప్లే గరిష్ఠంగా 10,000 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది.
Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్
మొబైల్ పనితీరు కోసం హానర్ మ్యాజిక్ 9లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను అందించారు. దీంతో గేమింగ్, మల్టీటాస్కింగ్, కెమెరా ప్రాసెసింగ్ వంటి పనుల్లో మంచి పనితీరు అందించేందుకు ఫోన్‌ను రూపొందించారు.
8,000mAh భారీ బ్యాటరీ
హానర్ మ్యాజిక్ 9లో 8,000mAh Qinghai లేక్ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇందులో 25% సిలికాన్ కంటెంట్ ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 80W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంది. 300కు పైగా కార్ మోడళ్లలో 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ అనుకూలంగా ఉంటుందని హానర్ తెలిపింది. ఇక ఇందులో మూడో తరం C3 RF చిప్, 7-చిప్ RF ఆర్కిటెక్చర్, హానర్ హొంగ్యాన్ AI క్లౌడ్ మ్యాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక దీనికి IP68, IP69, IP69K రేటింగ్స్‌ను అందించారు.
ధరలు
HONOR Magic9 సిరీస్ ప్రస్తుతం చైనాలో ఆర్డర్లకు అందుబాటులో ఉంది. HONOR Magic9 మోడల్స్‌ను వివిధ RAM, స్టోరేజ్ వేరియంట్లలో విడుదల చేశారు. ధరలు ఇలా ఉన్నాయి.
- 12GB + 256GB: 4,999 యువాన్ (సుమారు రూ.71,475).
- 12GB + 512GB: 5,499 యువాన్ (సుమారు రూ.78,625).
- 16GB + 512GB: 5,999 యువాన్ (సుమారు రూ.85,775).
- 16GB + 1TB: 6,999 యువాన్ (సుమారు రూ.1,00,070).
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!