Flight Tickets: కరోనా కారణంగా పర్యాటకంపై ఆధారపడిన దేశాలు ఆర్థికంగా చితికి పోయాయి. కోవిద్ దెబ్బకు టూరిజమే ప్రధాన వనరుగా ఉన్న శ్రీలంక పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అది ఇప్పట్లో కోలుకునేలా లేదు. ప్రపంచంలో అలాంటి పేద దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ కోవకు చెందినవే హాంకాంగ్, సింగపూర్ దేశాలు. ఇవి మాత్రం కాస్తంత కోవిద్ కుదుపుకు లోను కాకుండా జాగ్రత్త పడుతూ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే హాంకాంగ్ తన పూర్వ వైభవాన్ని సంతరించుకునే ప్రయత్నం చేస్తోంది. వివిధ దేశాల టూరిస్టులను ఆకర్షించేందుకు పలు పథకాలను తీసుకొస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం తమ దేశానికి వచ్చే పర్యాటకులకు ఏకంగా ఐదులక్షల విమాన టిక్కెట్లను ఉచితంగా అందించనుంది.
Read Also: Strongest Man: వామ్మో!.. ఏకంగా 548కిలోలు ఎత్తేశాడుగా
కరోనా సంక్షోభానికి ముందు హాంకాంగ్ ను ఏటా 56 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించేవారు. కానీ కరోనా వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడం, దేశాలన్నీ సరిహద్దులను మూసివేయడంతో పర్యాటకం స్తంభించింది. ఇప్పుడు కరోనా వ్యాప్తి బాగా తగ్గిపోవడంతో, హాంకాంగ్ మళ్లీ పర్యాటకంపై దృష్టి సారించింది. రూ.2 వేల కోట్ల విలువైన విమాన ప్రయాణ టికెట్లను ఫ్రీగా ఇస్తామని టూరిస్టులను ఊరిస్తోంది. హాంకాంగ్ ఎయిర్ పోర్టు అథారిటీ ఈ టికెట్లను రెండేళ్ల క్రితమే దేశీయ విమాన సంస్థల నుంచి కొనుగోలు చేసింది.
Read Also: Thief Jumps into Sea : పర్స్ కొట్టేసి.. తప్పించుకునేందుకు సముద్రంలోకి దూకాడు
అటు పర్యాటకులను రాబట్టడంతో పాటు, ఇటు నష్టాలతో ఉన్న దేశీయ విమాన సంస్థలను ఆదుకున్నట్టు ఉంటుందని భారీ ఎత్తున విమాన టికెట్లను కొనుగోలు చేసింది. ఈ టికెట్లను హాంకాంగ్ వాసులకు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా హాంకాంగ్ వచ్చే విదేశీయులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. విమానం ఎక్కడానికి ముందు కరోనా పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు సర్టిఫికెట్ ను సమర్పించాలి. దాంతో పాటు రాపిడ్ యాంటీజెన్ టెస్టు కూడా తప్పనిసరి చేశారు. కాగా. ఉచిత టికెట్ల విధివిధానాలను హాంకాంగ్ ప్రభుత్వం త్వరలోనే వెల్లడించే అవకాశాలున్నాయి.