Honda Activa Electric: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఎట్టకేలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఈరోజు (నవంబర్ 27) కంపెనీ రెండు వేరియంట్లలో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసింది. యాక్టివా E, యాక్టివా QC1 పేర్లతో వీటిని విడుదల చేసారు. హోండా యాక్టివా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోని రోడ్ల పరిస్థితికి అనుగుణంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయగా.. యాక్టివా E మాత్రం భారతదేశంతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల కోసం అభివృద్ధి చేసారు.
Also Read: Sanjay Raut: ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయే విఫలం.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి..
ఇకపోతే, ఈ రెండు ఎలక్ట్రిక్ వాహనాలు 2025 నాటికి అందుబాటులోకి వస్తాయి. ఈ వాహనాల కోసం బుకింగ్ జనవరి 1, 2025 నుండి ప్రారంభమవుతుంది. రెండు ఉత్పత్తుల ధరలు జనవరి 2025లో తెలవనున్నాయి. ఇక డెలివరీ మాత్రం ఫిబ్రవరి 2025 నుండి ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి దేశములో కేవలం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలలో విక్రయించబడుతుంది. కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను బెంగళూరు సమీపంలోని కర్ణాటకలోని తన ఫెసిలిటీలో తయారు చేస్తోంది. ఇక హోండా యాక్టివా E రెండు మార్చుకోగల బ్యాటరీలను కలిగి ఉంది. ఇది ఛార్జింగ్‌లో అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది.
డిజైన్ పరంగా చూస్తే.. రెండు బైక్స్ లో కొన్ని స్వల్ప తేడాలు ఉన్నాయి. హోండా Activa E ముందు, వెనుక భాగంలో LED కాంబినేషన్ లైట్లను పొందుతుంది. అయితే QC1 మాత్రం అధిక మౌంటెడ్ LED DRLలు లభిస్తాయి. అలాగే Activa E ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. అదే QC1 లో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇక ఈ బైకుల స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. హోండా యాక్టివా బ్లూటూత్ కనెక్టివిటీతో TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది. ఈ మోడల్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, అలాగే కాల్ ఇంకా ఎస్ఎంఎస్ అలర్ట్‌లను కలిగి ఉంది. మరోవైపు QC 1 విషయానికి వస్తే.. ఒక సాధారణ LCD యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. స్టాండర్డ్, స్పోర్ట్, ఎకానమీ మోడ్ లు ఉంటాయి.
Also Read: Sanjay Raut: ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయే విఫలం.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి..
మార్చుకోగలిగిన బ్యాటరీ సెటప్ హౌసింగ్ రెండు 1.5 kWh బ్యాటరీలను పొందుతుంది. ఈ బ్యాటరీల యూనిట్ నుండి పవర్ వీల్ సైడ్ ఎలక్ట్రిక్ మోటారుకు బదిలీ చేయబడుతుంది. ఇది 4.2 kW (5.6 bhp) పవర్ అవుట్‌పుట్‌ని కలిగి ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 102 కి.మీ. ప్రయాణించొచ్చని, టాప్‌స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు వెళ్లవచ్చని కంపెనీ చెబుతోంది. ఇక హోండా క్యూసీ 1లో 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో, సింగిల్ ఛార్జ్‌తో 80 కి.మీ. రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 50 కి.మీ. మాత్రమే. చూడాలి మరి ఇప్పటి వరకు ఉన్న ప్రముఖ బ్రాండ్స్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ బైకులు ఎంతవరకు పోటీని ఇవ్వగలవో. ఇక ఈ బైక్ ధరలు రూ.1లక్ష నుండి రూ.1.30 లక్షల వరకు ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు నిపుణులు.