Honda CB1000 Hornet SP: హోండా కంపెనీ తన లేటెస్ట్ లీటర్-క్లాస్ స్ట్రీట్ నేకెడ్ బైక్ CB1000 Hornet SPను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రీమియమ్ ఫీచర్లతో, ఆకట్టుకొనే స్టైలిష్ లుక్ తో ఈ బైక్ చూడడానికి ప్రీమియంగా ఉంది. మరి ఈ స్టైలిష్ బైక్ సంబంధించిన పూర్తి వివరాలను చూద్దామా..
పవర్‌ఫుల్ ఇంజిన్:
CB1000 Hornet SPలో 999cc, ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 155bhp పవర్ @ 11,000rpm, 107Nm టార్క్ @ 9,000rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది.
డిజైన్:
బైక్ డిజైన్ పరంగా ఇది ఒక మాస్ అట్రాక్టివ్ స్ట్రీట్ నేకెడ్ లుక్‌ను కలిగి ఉంది. ముందుభాగంలో ఉన్న హెడ్‌ల్యాంప్ బైక్‌కు ఫైటర్ లుక్ ఇస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్, అప్స్వెప్ట్ టెయిల్ సెక్షన్ స్ట్రీట్ బైక్‌కు పూర్తిగా స్టైలిష్ లుక్ ను తీసుక వస్తున్నాయి.
సస్పెన్షన్, బ్రేకింగ్:
ఈ బైక్‌లో స్టీల్ ఫ్రేమ్, Showa SFF-BP ఫ్రంట్ ఫోర్క్, Ohlins TTX36 రియర్ మోనోషాక్ ఉన్నాయి. అలాయ్ వీల్స్‌పై ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చబడ్డాయి. బ్రేకింగ్ కోసం ఫ్రంట్‌లో డ్యుయల్ డిస్కులు, రియర్‌లో సింగిల్ డిస్క్ అందుబాటులో ఉన్నాయి.
ఫీచర్లు:
బైక్‌లో రైన్, స్టాండర్డ్, స్పోర్ట్ అనే మూడు ప్రీసెట్ రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అలాగే, రెండు ‘User’ మోడ్‌లు కలిగి ఉండి వాటిలో థ్రాటిల్ రెస్పాన్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అంశాలను కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే బైక్ కు 5 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఇక ఈ బైక్ ధరను రూ. 12.35 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణయించబడింది. కవాసాకి Z900, ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ R, RS వంటి బైక్‌లతో పోటీ పడేందుకు హోండా ఈ బైక్‌ను తీసుకొచ్చింది. హోండా భారత మార్కెట్లో హై-ఎండ్ SP వెర్షన్ ను లాంచ్ చేసింది. స్టాండర్డ్ వెర్షన్‌ను విడుదల చేస్తే మరింత యాక్సెసిబుల్‌గా ఉండేది. అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్‌తో ఈ బైక్ ప్రీమియం రైడర్లను ఆకట్టుకునే అవకాశముంది.