Honda Activa CNG: భారతదేశంలో బజాజ్ ఆటో తన మొట్ట మొదటి సిఎన్‌జి బైక్‌ను విడుదల చేయగా.. అప్పటి నుండి అనేక కంపెనీలు సిఎన్‌జి బైక్‌లను తీసుక రావడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిఎన్‌జి యాక్టివా హోండా ద్వారా వస్తుందని చాలా వార్తలు వినిపించాయి. హోండా లో సక్సెస్ ఫుల్ స్కూటర్ అయిన యాక్టివా నుంచి సిఎన్‌జి వేరియంట్ వస్తుందని హోండా ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇందులో అది లేట్ అవుతూ వస్తుంది. సిఎన్‌జి వెహికల్స్ అన్ని కంపెనీలు తీసుకొస్తున్న హోండా కంపెనీ మాత్రం కాస్త టైం తీసుకుంది.
Also Read: Puspa Bike: పుష్ప క్రేజ్ మాములుగా లేదుగా.. అభిమాని బైకును భలే మార్చేసాడుగా
ఇక సమాచారం మేరకు.. కొత్త యాక్టివాలో రెండు చిన్న సిఎన్‌జి ట్యాంక్‌లను చూడొచ్చు. దీన్ని ముందు స్టోరేజ్ బాక్స్‌లో ఇన్‌స్టాల్ చేయనున్నారు. ఈ స్కూటర్ 100 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అయితే, ఇప్పటి వరకు ఈ స్కూటర్‌కు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నవంబర్ 27న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ, ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు.
Also Read: TVS Apache RTR 160 4V: కొత్త ఫీచర్లతో టీవీఎస్ అపాచీ రిలీజ్.. ధర ఎంతంటే..?
వీటి వల్ల పర్యావరణానికి కూడా ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. అయితే, హోండా నుంచి యాక్టివా మోడల్ CNG వేరియంట్, ఎలెక్ట్రిక్ లను ఆవిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఇకపోతే, హోండా యాక్టివా సిఎన్‌జిలో స్థిరమైన డిజైన్ తో ఊహించని మార్పులతో రాబోతుందని సమాచారం. ఈ సిఎన్‌జి వర్షన్ డిజైన్ అప్ గ్రేడ్ ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ సుమారు 100 కి. మీ. పరిధి అందిస్తుండడంతో.. రోజు వారి ప్రయాణీకులకు మంచి ఎంపిక కానుంది. హోండా యాక్టివా ఇకపై సిఎన్‌జి, ఎలెక్ట్రిక్ రెండు వేరియంట్స్ లో అందుబాటులోకి రానుంది. దింతో కచ్చితంగా యాక్టివా ఫ్యాన్స్ కి ఎంతో మేలు కానుంది.