Summer Energy Drink: వేసవి తాపానికి ‘చెక్’.. ఇంట్లోనే తయారు చేసుకోండి ‘హోంమేడ్ గ్లూకోజ్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Summer Energy Drink: ఎండలు ముదురుతున్నాయి.. బయటకు వెళ్తే చాలు చెమటలు పట్టేయడం, నీరసం ఆవహించడం సహజం. ఇలాంటి సమయంలో మనకు వెంటనే గుర్తుకు వచ్చేది చల్లని నిమ్మరసం. అయితే ప్రతిసారీ నిమ్మకాయలు కోసి, పంచదార కలిపి రసం తయారు చేయడం కాస్త ఓపికతో కూడిన పని. అలా కాకుండా, కేవలం నీళ్లలో ఒక స్పూన్ పొడి కలిపితే చాలు.. చల్లని నిమ్మరసం తయారయ్యేలా ‘లెమన్ ప్రీమిక్స్’ ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు. ఇది అచ్చం గ్లూకోజ్ పౌడర్లా పనిచేస్తూ తక్షణ శక్తిని ఇస్తుంది. ఇంతకీ దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Trump Tariffs: టారిఫ్ వార్‌కు బ్రేక్.. ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో బిగ్ షాక్..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
కావలసిన పదార్థాలు:
నిమ్మకాయలు: 10
పంచదార: 4 కప్పులు
ఉప్పు: 1 టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా నిమ్మకాయలను తీసుకుని ప్లాట్‌ఫామ్ మీద పెట్టి కాస్త ఒత్తిడితో దొర్లించాలి. ఇలా చేయడం వల్ల రసం ఎక్కువగా వస్తుంది. తర్వాత వాటిని కట్ చేసి రసాన్ని వడకట్టి ఒక కప్పులోకి తీసుకోవాలి. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని అందులో ఒక కప్పు నిమ్మరసాన్ని పోయాలి. అందులోనే నాలుగు కప్పుల పంచదారను వేసి సమానంగా పరవాలి. పంచదారను, రసాన్ని పూర్తిగా కలపకూడదు, కేవలం స్ప్రెడ్ చేయాలి. ఈ ప్లేట్‌ను ఎండలో కాకుండా, ఇంట్లోనే ఫ్యాన్ కింద రెండు రోజుల పాటు కదపకుండా ఉంచాలి. ఎండలో పెడితే నిమ్మరసం చేదు వచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల తర్వాత అది కాస్త గట్టిపడుతుంది. అప్పుడు స్పూన్‌తో గీకి, మరో ప్లేట్లోకి తీసుకుని ఇంకొక రోజు ఆరనివ్వాలి. మూడు రోజుల తర్వాత అది క్రిస్టల్స్‌లా మారుతుంది.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుని అందులో ఒక టీస్పూన్ ఉప్పు వేసి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన పొడిని జల్లెడ పట్టి, నూకలా ఉన్న భాగాన్ని మళ్ళీ మిక్సీ పట్టి మెత్తటి పొడిలా చేసుకోవాలి. అంతే.. ‘హోంమేడ్ గ్లూకోజ్’ లేదా లెమన్ ప్రీమిక్స్ సిద్ధం. ఈ పొడిని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఏడాది పాటు తాజాగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు లేదా అతిథులు వచ్చినప్పుడు చిటికెలో నిమ్మరసం కలిపి ఇచ్చేయవచ్చు.
చిటికెలో ఇలా సర్వ్ చేసుకోవచ్చు..
ఒక గ్లాసులో ఐస్ క్యూబ్స్, నానబెట్టిన సబ్జా గింజలు, కాస్త పుదీనా ఆకులు వేసి, అందులో మూడు నుంచి నాలుగు స్పూన్ల లెమన్ ప్రీమిక్స్ పొడిని వేయాలి. చల్లని నీళ్లు లేదా సోడా కలిపితే అద్భుతమైన రుచితో ఉండే ఇన్స్టంట్ లెమన్ షర్బత్ రెడీ. ఈ వేసవిలో మీరు కూడా ఈ లెమన్ ప్రీమిక్స్ పొడిని తయారు చేసుకుని, ఎండ నుంచి ఉపశమనం పొందండి.
READ ALSO: Rao Bahadur: మహేష్ బాబు ప్రెజెంట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!