How to Make Besan at Home: ఇక మార్కెట్లో కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే స్వచ్ఛమైన శనగపిండి తయారు చేసుకోండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How to Make Besan at Home: భారతీయ వంటగదిలో శనగపిండికి ఉండే ప్రాముఖ్యతే వేరు. పకోడీలు, బజ్జీలు, లడ్డూలు ఇలా ఎన్నో రుచికరమైన వంటకాల తయారీలో ఇది కచ్చితంగా ఉండాల్సిందే. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో రకరకాల మిఠాయిలు చేయడానికి శనగపిండి ఎంతో అవసరం. అందుకే చాలా ఇళ్లలో ఇది ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అయితే మార్కెట్లో దొరికే పిండి ఎంతవరకు స్వచ్ఛమైనదోనని చాలామంది ఆందోళన పడుతుంటారు. ఆ టెన్షన్ లేకుండా ఇంట్లోనే సులభంగా శనగపప్పుతో స్వచ్ఛమైన శనగపిండిని తయారు చేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అరకిలో నుంచి ముప్పావు కేజీ వరకు శనగపప్పు ఉంటే చాలు, ఎంతో తాజాగా ఉండే పిండిని రెండు సులభమైన పద్ధతుల్లో తయారు చేసుకోవచ్చు.
మొదటి పద్ధతిలో పప్పును వేయించకుండా నేరుగా పిండి పట్టుకోవచ్చు. దీనికోసం ముందుగా శనగపప్పును శుభ్రంగా చెత్తాచెదారం లేకుండా ఏరుకోవాలి. ఆ తర్వాత పప్పును ఒకటి రెండు రోజులు మంచి ఎండలో బాగా ఆరబెట్టాలి. దాంట్లో ఎలాంటి తడి, తేమ లేకుండా పప్పు గలగలలాడేలా గట్టిగా మారాలి. అలా ఎండిన పప్పును మిక్సీ జార్లో కొద్దికొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిని సన్నని జల్లెడతో జల్లించాలి. ఒకవేళ జల్లెడలో రవ్వ లాంటి బరక పిండి మిగిలితే, దాన్ని మళ్లీ మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవచ్చు. ఇలా ఎంతో సులభంగా మొదటి పద్ధతిలో స్వచ్ఛమైన పిండి రెడీ అవుతుంది.
Also Read
- Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
- Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
- World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
- Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
ఇక రెండో పద్ధతిలో కొద్దిగా వేయించి పిండి తయారు చేసుకోవచ్చు. దీనికోసం కూడా పప్పును శుభ్రం చేసి ఒకరోజు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి, ఎండబెట్టిన పప్పును అందులో వేసి సన్నని మంటపై మూడు నుంచి నాలుగు నిమిషాలు వేయించాలి. పప్పు రంగు మారిపోకుండా, అలాగే మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఆ తర్వాత పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొదటి పద్ధతిలాగే ఈ పిండిని కూడా జల్లెడ పట్టుకుని, బరకగా ఉన్నదాన్ని మళ్లీ రుబ్బుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న పిండిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిండి పూర్తిగా చల్లారిన తర్వాతే గాలిచొరబడని పొడి డబ్బాలో లేదా గాజు జార్లో భద్రపరచుకోవాలి. పిండి తీసేసరి ప్రతిసారీ పొడిగా ఉన్న చెంచానే వాడాలి, డబ్బా మూత గట్టిగా బిగించాలి. తేమ, వేడి తగలకుండా చూస్తే పురుగు పట్టకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఒకవేళ పిండి వాసన మారినా లేదా పురుగు పట్టినా అస్సలు వాడకూడదు. ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్న స్వచ్ఛమైన శనగపిండితో ఎన్నో రకాల రుచులు ట్రై చేయవచ్చు. అయితే ఇంట్లో పిండి పట్టేటప్పుడు శనగపప్పులో కొంచెం కూడా తేమ ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తేమ ఉంటే పిండి సరిగ్గా రాదు, నాణ్యత దెబ్బతింటుంది. అందుకే పప్పును బాగా ఎండబెట్టుకోవడం చాలా ముఖ్యం.
తాజావార్తలు
-
AP Govt: అసైన్డ్, ఇనాం, పట్టా భూముల రైతులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..
-
Nagarjuna King 100: ఐకానిక్ జోడీ ఈజ్ బ్యాక్: కానీ ఈసారి ‘ప్రేమ’ లేదు!
-
China Space Plane: అంతరిక్షంలో చైనా రహస్య విమానం.. అమెరికా నిఘా నివేదికలో కీలక వివరాలు.!
-
Hyderabad Clean and Traffic-Free : హైదరాబాద్‌కు కొత్త టార్గెట్.. క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్పు
-
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాసుల వర్షం.. దసరా ఉత్సవాల హుండీ ఆదాయం రూ.11.59 కోట్లు..
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!