NTV Telugu Site icon

Home Minister Anitha: విశాఖ లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై స్పందించిన హోం మంత్రి

Home Minister Anitha

Home Minister Anitha

Home Minister Anitha: విశాఖ లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్‌తో మంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను హోంమంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం ఉండగా ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.

Read Also: Vizag Crime: విశాఖలో దారుణం.. లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. వీడియోలు తీసి..!

విశాఖపట్నంలో లా చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తోన్న విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. అంతటితో ఆగకుండా.. ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.. బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు.. ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని మళ్లీ మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టారు.. అయితే, పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగు చూసింది.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. బాధితురాలు మధురవాడలోని ఎన్‌వీపీ లా కాలేజీలో లా థర్డ్‌ ఇయర్‌ చదువుతోంది.. ఆమె సహచరి విద్యార్థి అయిన వంశీతో స్నేహం చేసింది.. అయితే, తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంశీ.. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన కంబాలకొండకు తీసుకుని వెళ్లాడు.. అక్కడే విద్యార్థిని ఎంత వారించినా వినకుండా.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Read ALso: Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్‌ బిల్లు ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం.. కీలక వ్యాఖ్యలు

ఇక, మళ్లీ అదే నెల 13వ తేదీన డాబాగార్డెన్ లో ఉంటున్న తన ఫ్రెండ్‌ ఆనంద్‌ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్‌, రాజేష్‌, జగదీష్‌ కూడా అక్కడికి వచ్చి ఒకరితర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఇక, ఆ దృశ్యాలు తమ ఫోన్లలో చిత్రీకరించి.. బెదిరిస్తూ.. మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడి.. తమ పశువాంఛ తీర్చుకున్నారు.. అయితే, 2 నెలల తర్వాత మళ్లీ ఆనంద్‌, రాజేష్‌, జగదీష్‌.. బాధితురాలికి ఫోన్‌ చేసి.. తమ వద్దకు రావాలని, కోరిన కోరికను తీర్చాలని బెదిరించారు.. లేకపోతే పాత వీడియోలు బయటపెడతామంటూ భయపెట్టారు.. దీంతో, ఈ విషయం వంశీ దృష్టికి తీసుకెళ్లింది బాధితురాలు.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోసం చేసిన వంశీ కూడా వారి కోరిక తీర్చాలంటూ మానసికంగా వేధించసాగాడు.. రోజురోజుకీ వేధింపులు ఎక్కువ అవ్వడంతో.. ఈ నెల 18వ తేదీన ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మాహత్యాయత్నం చేసింది బాధితురాలు.. ఇది గమనించిన బాధితురాలి తండ్రి అడ్డుకుని.. ఏం జరిగిందని నిలదీయడంతో.. అసలు విషయం బయటపెట్టింది.. దీంతో.. విశాఖ టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసుపై హోంమంత్రి స్పందించి యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.