Parshuraam: హోంబలే సినిమాటిక్ యూనివర్స్ నుంచి..పరశురామ్ భారీ అనౌన్స్మెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర రంగంలో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హోంబలే ఫిల్మ్స్, నేడు ఒక పవర్ఫుల్ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది విడుదలైన ‘మహావతార్: నరసింహ’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ యానిమేటెడ్ ఎపిక్ ఫ్రాంచైజీలో భాగంగా రెండో చిత్రం ‘మహావతార్ పరశురామ్’ (Mahavatar Parshuraam) టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.
Also Read
- EV Road Tax Cuts: ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకుంటున్నారా? రూ.60 వేల వరకు ఆదా చేసే ఛాన్స్..!
- NEET Exam: రేపే నీట్ ఎగ్జామ్.. ఈసారైనా పగడ్బందీగా జరిగేనా?
- Rohit Sharma: హిట్‌మ్యాన్ హిస్టరీ.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. చరిత్రలో ఒకే ఒక్కడిగా..
- APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్‌కు భారీ ఏర్పాట్లు
హోంబలే ఫిల్మ్స్ మరియు క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా శ్రీమహావిష్ణువు దశావతారాల నేపథ్యంలో మొత్తం 7 చిత్రాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 2025లో వచ్చిన ‘నరసింహ’తో ఈ ప్రయాణం మొదలైంది. ఇప్పుడు రెండో భాగం పరశురాముడి అవతారంపై రాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం డిసెంబర్ 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ భీభత్సంగా ఉంది. “ధర్మం పతనమైనప్పుడు, పరశు (గొడ్డలి) లేస్తుంది” అనే ట్యాగ్ లైన్‌తో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
అధర్మాన్ని అంతం చేసి, లోకంలో ధర్మాన్ని నిలబెట్టే పరశురాముడి పాత్రను దర్శకుడు అశ్విన్ కుమార్ అత్యంత శక్తివంతంగా తెరకెక్కిస్తున్నారు. కేవలం పిల్లల కోసం మాత్రమే కాకుండా, పెద్దలను కూడా అలరించేలా అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో ఈ యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ చేతిలో ‘కాంతార: చాప్టర్ 1’, ‘సలార్ 2’ వంటి భారీ చిత్రాలు ఉండగానే, ఇలాంటి పౌరాణిక యానిమేటెడ్ చిత్రాలను ప్రకటించడం విశేషం. ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ (Sam CS) సంగీతం అందిస్తున్నారు.
𝐖𝐇𝐄𝐍 𝐃𝐇𝐀𝐑𝐌𝐀 𝐅𝐀𝐋𝐋𝐒, 𝐓𝐇𝐄 𝐏𝐀𝐑𝐒𝐇𝐔 𝐑𝐈𝐒𝐄𝐒 🪓
Presenting the next from the Mahavatar Cinematic Universe 🔥#MahavatarParshuraam
Coming December 2027.Not a ruler, but a force against adharma, restoring balance across ages.
Wishing you a blessed… pic.twitter.com/wKS0T5E9rR— Hombale Films (@hombalefilms) April 19, 2026
తాజావార్తలు
-
EV Road Tax Cuts: ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకుంటున్నారా? రూ.60 వేల వరకు ఆదా చేసే ఛాన్స్..!
-
NEET Exam: రేపే నీట్ ఎగ్జామ్.. ఈసారైనా పగడ్బందీగా జరిగేనా?
-
Rohit Sharma: హిట్‌మ్యాన్ హిస్టరీ.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. చరిత్రలో ఒకే ఒక్కడిగా..
-
APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్‌కు భారీ ఏర్పాట్లు
-
Israel-Lebanon: శాంతి ఒప్పందానికి తూట్లు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!