CM Chandrababu: రెబల్స్‌కు పార్టీలో నో ఎంట్రీ.. చంద్రబాబు సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఆశించినవారికి అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయారు.. దీంతో, కొంతమంది పార్టీకి రెబల్స్‌గా మారి.. ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు.. అయితే, రెబల్స్‌గా పోటీ చేసి గెలిచిన వారిపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రెబల్స్‌గా గెలిచిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోటీ చేసిన వారికి తిరిగి పార్టీలో చోటు ఉండదనే సంకేతాలిచ్చారు. మరోవైపు ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన మూడు పార్టీల ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
పెట్టుబడులపై వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లాలి
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని చంద్రబాబు సూచించారు. మూడు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీలు, పరిషత్‌లు, మున్సిపాలిటీల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో నాణ్యమైన చర్చలు జరపాలని తెలిపారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు అంటే కేవలం పెట్టుబడుల లెక్కలు చెప్పుకోవడం మాత్రమే కాదన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు. ఎంత పెట్టుబడి వచ్చింది? వాటి ద్వారా ఏం నేర్చుకున్నాం? రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపించాం? అనే అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. కొత్త విధానాలు రూపొందించడంతో పాటు వాటి ఫలితాలను కూడా విశ్లేషించుకోవాలని పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu: రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలి..! రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలి..!
- CPS to OPS Conversion: ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. డెడ్‌లైన్ ఎప్పుడంటే..?
- SEC: ఏపీలో మరో ఎన్నికల సందడి.. 13 వేల పంచాయతీలు, 23 మున్సిపాలిటీలపై ఫోకస్
- Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
రెండున్నరేళ్లలో ఏపీ బ్రాండ్‌ను తిరిగి నిలబెట్టాం
గతంలో పూర్తిగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను రెండున్నరేళ్లలో తిరిగి నిలబెట్టామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావాలంటే బ్రాండ్ ఇమేజ్ ఎంతో ముఖ్యమని తెలిపారు. విశాఖపట్నంలో జరగనున్న సదస్సుకు ముందు ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడతానని వెల్లడించారు. సాంకేతికత, విజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకునే నాయకత్వం అవసరమని, వినూత్న ఆలోచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇక, కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లుగా చేపట్టిన పాలనకు ప్రజలు ఎన్నికల ద్వారా ఆమోదం తెలిపారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే ప్రజలు తమకు మద్దతు పలికారని అన్నారు. తుపాను పరిస్థితుల్లోనూ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలకు అభినందనలు తెలిపారు. మంచి రాజకీయాలు, మంచి ప్రభుత్వం, సుపరిపాలనతో ప్రజల్లో విశ్వాసం పెంచగలిగామని చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ కలయికపై ప్రజలు నమ్మకం ఉంచారని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు, తమపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా ఫలితాలు అందించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న ‘రణబాలి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
-
CM Chandrababu: రెబల్స్‌కు పార్టీలో నో ఎంట్రీ.. చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Nitesh Tiwari : ‘రామాయణ’ డైరెక్టర్‌కు అనశ్వర రాజన్’కు ఉన్న ఈ క్రేజీ లింక్ తెలుసా?
-
Dulquer Salmaan: ‘సీన్’ డైరెక్టర్‌తో దుల్కర్ సినిమా? హీరోయిన్గా క్రేజీ బ్యూటీ!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!