Holding Urine : మూత్రం ఎక్కువ సేపు ఆపుకుంటే ఎంతటి డేంజరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holding Urine : మూత్ర విసర్జన అనేది సహజ ప్రక్రియ. చాలామంది మామూలుగా ప్రయాణాలు చేసేటప్పుడు గానీ లేదా ఇంకొన్ని సందర్భాల్లో మూత్రాన్ని ఆపుకుంటారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లు లేదా పబ్లిక్ టాయిలెట్లలో మూత్రానికి వెళ్లేందుకు సిగ్గుపడుతుంటారు. కానీ ఎక్కువ కాలం మూత్రాన్ని ఆపడం వల్ల 15 శాతం మందికి ప్రోస్టేట్, కిడ్నీల్లో రాళ్లు, మూత్రపిండాల సమస్యలు, పైల్స్ వంటి సమస్యలు ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. చాలా మంది బలవంతంగా మూత్రాన్ని నియంత్రిస్తుంటారు. కానీ మూత్రంలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది మూత్రాశయంలో తీవ్రమైన సంక్రమణకు కారణమవుతుంది. మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయం సంచిలా కనిపిస్తుంది. అలాగే ఇది కిందికి జారిపోతుంది. దీనివల్ల మూత్రం పూర్తిగా విడుదల కాదు. కొన్నిసార్లైతే మూత్రాశయం కూడా పగిలిపోవచ్చు.
Read Also: Health Tips: ఇలా చేస్తే ఏడు రోజుల్లో ఎంత కొవ్వు అయినా ఇట్టే కరిగిపోవాల్సిందే
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
మూత్రాశయంలో ఎక్కువ కాలం మూత్రం పేరుకుపోయినప్పుడు.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య కూడా పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపే వ్యక్తులు మూత్రం పోసేటప్పుడు నొప్పి కలుగుతుంది. మూత్రాశయం ఎక్కువ సేపు మూత్రంతో నిండి ఉంటే.. మూత్రాశయం బలహీనంగా మారుతుంది. అలాగే దాని బయటి పొర పలుచగా మారుతుంది. గర్భిణులు మూత్రాన్ని ఆపడం కష్టమవుతుంది. దీనివల్ల మూత్రం లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ మూత్రాశయంతో మూత్రం నిండితే గర్భంలో ఒత్తిడి పెరుగుతుంది. ఏడాది లోపు వయసున్న పిల్లలు ప్రతి గంటకు మూత్ర విసర్జన చేయాలి. ఎందుకంటే వారికి మూత్రాశయం చాలా చిన్నగా ఉంటుంది. ఈ కారణంగానే వాళ్లు త్వరగా మూత్ర విసర్జన చేస్తారు. అయితే కాలక్రమేణా పిల్లలు రోజుకు 10 నుంచి 12 సార్లు టాయిలెట్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇక పెద్దల విషయానికొస్తే.. వీల్లు రోజుకు 6 సార్లు మూత్ర విసర్జన చేయాలి. ఇందుకోసం రోజూ పుష్కలంగా నీటిని తీసుకోవాలి.
Read Also: LIC Jeevan Arogya Policy : ఈ కార్డు ఉంటే.. హాస్పిటల్ బిల్ కట్టే పనేలేదు
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!