Hyderabad: నగరంలో పట్టపగలే హిట్ అండ్ రన్ కేసు.. మద్యం మత్తులో యువకుడు..

  • బాలనగర్ లో హిట్ అండ్ రన్ కేసు
  • సాయి కీర్తి (19)అనే యువతి ఢీ కొట్టిన వాహనం
  • ఐడీపీఎల్ చౌరస్తాలో ఘటన
  • కారును ఆపకుండా అతివేగంతో వెళ్లిపోయిన యువకుడు
  • ఫతే నగర్‌లో కారు ఆపి అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hyd

Hyd

హైదరాబాద్‌లోని బాలనగర్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు సంచలనం రేపింది. మద్యం మత్తులో ఓ యువకుడు ఫార్చునర్ కారుతో యువతిని బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో 19 ఏళ్ల యువతి సాయి కీర్తి తీవ్రంగా గాయపడింది. ఈ రోజు ఉదయం బాలనగర్ ఐడీపీఎల్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. ఫార్చునర్ కారులో అతివేగంగా ప్రయాణిస్తున్న యువకుడు మద్యం మత్తులో ఉండటంతో అదుపుతప్పి రోడ్డుపై నడుస్తున్న సాయి కీర్తిని ఢీకొట్టాడు. అయితే, ఆక్సిడెంట్ చేసిన వెంటనే కారు ఆపకుండా అక్కడి నుంచి పరుగుతీశాడు.

READ MORE: Delimitation Effect: ఎమర్జెన్సీగా ఢిల్లీ టూర్‌కు పళినిస్వామి.. బీజేపీ అగ్ర నేతలను కలిసే అవకాశం

×
×
Ad

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు నేరుగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని ఫతేనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతడిని బల్కంపేట్‌కు చెందిన గొగం అనిల్‌గా గుర్తించారు. దర్యాప్తులో అనిల్ తన స్నేహితులతో కలిసి మొయినాబాద్‌లోని ఓ ఫాం హౌస్‌లో పార్టీ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పార్టీ అనంతరం మద్యం మత్తులోనే కారును నడిపాడు. అతివేగం, మద్యం మత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయి కీర్తిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

READ MORE: Gorantla Butchaiah Chowdary: నియోజకవర్గాల పునర్విభజనపై గోరంట్ల కీలక వ్యాఖ్యలు.. బహిరంగంగా వద్దు..!