HIT 2: అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టుతోంది. థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన తీరు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.
Read Also: Hair Transplant : బట్టతల పోతదనుకుంటే బతుకే లేకుండా పోయింది
సినీ క్రిటిక్స్ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరుచుతున్నారు. దీంతో ఈ సినిమా తొలిరోజే మంచి వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ సినిమాకు తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.11.27 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కినట్లుగా చిత్ర బృందం వెల్లడించింది. హీరో అడివి శేష్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఓపెనింగ్స్ అని ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. హిట్-2 సినిమాకు ఇంత మంచి ఆదరణ అందిస్తూ, ఈ సినిమాను నిజమైన హిట్ చేసిన ప్రేక్షకులకు నిర్మాత నేచురల్ స్టార్ నాని థ్యాంక్స్ చెబుతున్నారు. ఇక హిట్ వర్స్‌లో రాబోయే నెక్ట్స్ మూవీలో హీరోగా నాని నటించబోతున్నట్లు హిట్-2 సినిమాలో చూపెట్టడంతో ప్రేక్షకులు థ్రిల్ అవుతున్నారు. మరి హిట్-2 సినిమా మున్ముందు ఇంకా ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.