Hyderabad: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్ చౌక్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఊహించని విధంగా ఒకే రూట్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. రెండు వాహనాలు ఒకే రూట్‌లో రావడంతో గందరగోళం నెలకొంది.
Read Also: Mahesh Babu: జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల్లో ఓటేసిన మహేశ్ బాబు, రామ్‌చరణ్
కోట్ల అలీజ బిబికా బజార్ చౌరస్తా వద్ద హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను పాతబస్తీ వాసులు అడ్డుకున్నారు. మాధవీలతకు వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు అంటూ మాధవీలత పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. దీంతో వెంటనే జోక్యం చేసుకొని యువకులను అక్కడి నుంచి పోలీసులు పంపించి వేశారు. వారిని అక్కడి నుంచి పంపించి వేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Read Also: Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఆ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్