NTV Telugu Site icon

BRS Leaders Protest: సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. జాయింట్ సీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

Cyberabad Cp

Cyberabad Cp

సైబరాబాద్‌ సీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌశిక్‌ రెడ్డి నివాసం దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు హరీష్‌రావు, బీఆర్‌ఎస్‌ నేతలు సీపీ ఆఫీస్‌కు వెళ్లారు. సీపీ ఆఫీస్‌లోకి ముగ్గురు ఎమ్మెల్యేలకు అనుమతి ఇచ్చారు. దీంతో.. ఎమ్మెల్యేలందరినీ అనుమతించాలంటూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీపీ ఆఫీస్‌లోని మెట్లపై బైఠాయించి బీఆర్‌ఎస్ ఆందోళన చేశారు. దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. సీపీ లేకపోవడంతో జాయింట్ సీపీకి బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లిఖిత పూర్వక ఫిర్యాదు రాసి ఇచ్చారు.

Read Also: Mysuru: లెహ్‌కు ట్రెక్కింగ్‌కి వెళ్లి శ్వాస అందక మైసూర్ ఇంజనీర్ మృతి

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కాంగ్రెస్ అనుచరులను అరెస్టు చేసేదాకా ఇక్కడ నుంచి వెళ్ళేది లేదని సీపీ కార్యాలయంలో మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. దగ్గరుండి దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వంగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

Read Also: CM Chandrababu: సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

ఫిర్యాదులోని అంశాలు:
– ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై హత్యాయత్నం చేసిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలి.
– ఉద్దేశ పూర్వక దాడి వెనక పోలీసుల వైఫల్యం ఉంది. DCP, ACP, CI లను సస్పెండ్ చేయాలి..

Show comments