Site icon NTV Telugu

Banakacharla Project: ఏపీ ప్రతిపాదిత “బనకచర్ల ప్రాజెక్ట్” వివాదంపై రేపు అత్యున్నత స్థాయి సమావేశం

Cm Revnath

Cm Revnath

ఏపీ ప్రతిపాదిత “బనకచర్ల ప్రాజెక్ట్” వివాదంపై రేపు అత్యున్నత స్థాయి సమావేశం జరుగనున్నది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఢిల్లీ కి చేరుకోనున్న ఏపి ముఖ్యమంత్రి.. రేపు ఉదయం ఢిల్లీకి రానున్న తెలంగాణ ముఖ్యమంత్రి.. తెలంగాణ వ్యతిరేకత, కేంద్ర అభ్యంతరాల నేపథ్యంలో చర్చ జరుగనుంది. అత్యున్నత స్థాయి (అపెక్స్ కమిటీ) సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. “బనకచర్ల ప్రాజెక్టు”కు కీలకమైన పర్యావరణ అనుమతులపై గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం.. “పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్” నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్రం.

Also Read:Prabhas : ఎన్నాళ్లకు డార్లింగ్.. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రభాస్

“కేంద్ర జల సంఘం” (సీడబ్లూసీ) అనుమతులు తీసుకోవాలన్న కేంద్రం.. “గోదావరి నదీ జలాల ప్రత్యేక న్యాయస్థానం” (గోదావరి రివర్ వాటర్‌ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్) నిర్ణయాలకు విరుద్ధంగా “బనకచర్ల ప్రాజెక్టు”.. ప్రతిపాదనలున్నాయన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలన్న కేంద్రం.. “గోదావరి నదిలో వరదనీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంది” అని సూచించిన నిపుణుల కమిటీ.. ఆతర్వాతే, పర్యావరణ అనుమతులు కోసం “టీఓఆర్”(టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌) ప్రతిపాదనలతో రావాలని ఏపి కి స్పష్టం చేసిన కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ.. జూన్‌ 17వ తేదీన నిర్వహించిన “ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటి” (ఈఏసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏపి కి సుస్పష్టం చేసిన కేంద్రం.

Also Read:Woman kills husband: భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టిన భార్య..

ఈ నేపథ్యంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో చర్చించి, గోదావరి నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాల వివాదాలను పరిష్కరించాలనే లక్ష్యంతో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రయత్నాలు. “బనకచర్ల ప్రాజెక్టు” కు కేంద్రం అడ్డంకులు, తెలంగాణ వ్యతిరేకత, వెనక్కి తగ్గేదే లేదంటున్న ఏపి.. రూ.81,500 కోట్ల అంచనాలతో ఏపీ ప్రతిపాదిత “పోలవరం– బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు” కు కేంద్రం అడ్డంకులు.. తెలంగాణ కూడా “బనకచర్ల ప్రాజెక్ట్” కు తీవ్ర వ్యతిరేకత.. “బనకచర్ల ప్రాజెక్టు” రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని తెలంగాణ వాదన వృథా జలాల పేరిట “గోదావరి ట్రైబ్యునల్‌” కేటాయింపులకు వ్యతిరేకంగా “బనకచర్ల ప్రాజెక్ట్” ను ఏపి ప్రతిపాదిస్తుందని తెలంగాణ అభ్యంతరం.. సముద్రంలో కలిసిపోయే వృథా జలాలను మాత్రమే వినియోగించుకుంటామనే విషయాన్ని కేంద్రానికి వివరిస్తామని అంటున్న ఏపీ.. ఏపి ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్ర “అటవీ పర్యావరణ నిపుణుల కమిటీ”

Also Read:Donald Trump: ట్రంప్ ఇక నువ్వు మారవా.? భారత్-పాక్ గురించి మళ్లీ కామెంట్స్..

పూర్తవడానికి ఏళ్లు పట్టే బనకచర్ల ప్రాజెక్ట్ బదులు, రాయలసీమ లో పెండింగ్ లో ఉన్న పలు ఇతర ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతున్న సాగునీటిరంగ నిపుణులు.. “బనకచర్ల ప్రాజెక్ట్” కోసం 17 వేల ఎకరాల అటవీ భూమితో సహా, మొత్తం సేకరించాల్సిన భూమి 48 వేల ఎకరాలు.. 27 కిలోమీటర్ల మేరకు సొరంగ మార్గంతో పాటు, మరో 400 కిలోమీటర్ల మేరకు పైప్‌ లైన్లతో బృహత్తర “బనకచర్ల.. ప్రాజెక్టు” ను నిర్మించాలనే కృతనిశ్చయంతో ఉన్న ఆంధ్ర ప్రదేశ్.. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా, గోదావరి జలాల్లో 518 టీఎంసీలు ఏపీకి, 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయుస్తూ “గోదావరి ట్రైబ్యునల్” నిర్ణయం.. “బనకచర్ల ప్రాజెక్టు” పై ఆంధ్ర ప్రదేశ్ వాదనలు.

Also Read:Donald Trump: ట్రంప్ ఇక నువ్వు మారవా.? భారత్-పాక్ గురించి మళ్లీ కామెంట్స్..

“బనకచర్ల ప్రాజెక్టు” పై వెనక్కి తగ్గేది లేదని, మళ్లీ ప్రతిపాదనలు పంపిస్తామంటున్న ఏపి.. ప్రతి ఏటా సముద్రంలో వృథాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించాలన్నదే ఏపి ప్రతిపాదన.. ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం పునఃపరిశీలించాలని వెనక్కి పంపిన మాట వాస్తవమే కానీ, వ్యతిరేకించలేదని వాదిస్తున్న ఏపి.. కేంద్రం వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేస్తూ మళ్లీ ప్రతిపాదనలు పంపుతామంటున్న ఏపి..

“కేంద్రజల సంఘం” (సీడబ్ల్యూసీ) అనుమతులను కూడా తీసుకుంటామంటున్న ఏపి.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోని గోదావరి బేసిన్‌లో కాళేశ్వరం, దేవాదుల, సమ్మక్కసాగర్, శ్రీరాం సాగర్‌ వంటి ఎన్నో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టారని, ఆయా ప్రాజెక్టుల గురించి ఏపీకి ఏమాత్రం తెలంగాణ సమాచారం ఇవ్వలేదని అంటున్న ఆంధ్ర ప్రదేశ్.. సముద్రంలోకి వృథాగా పోయే గోదావరి జలాలను, నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కుంటున్న రాయలసీమకు తరలించాలన్నదే ఏపి లక్ష్యం.. “బనకచర్ల ప్రాజెక్ట్” ను వ్యతిరేకిస్తోన్న తెలంగాణ తో ఘర్షణ వైఖరికి పోకుండా కేంద్రం జోక్యాన్ని కోరాలని తీర్మానం చేసిన ఏపి మంత్రివర్గం.

Also Read:Gautam Gambhir: గంబీర్ రిపోర్ట్ కార్డ్.. టీం ఇండియా హెడ్ కోచ్ నుంచి తొలగించే అవకాశం!

“బనకచర్ల ప్రాజెక్ట్” తో సహా, గోదావరి నదీ జలాల వినియోగం పై తెలంగాణ వాదనలు

నదీ జలాల వివాదాలను పరిష్కరించేందుకు “ఏపి పునర్విభజన చట్టం” లో పేర్కొన్న మేరకు, “కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ” (అపెక్స్ కమిటీ) అనుమతులు లేకుండా “బనకచర్ల ప్రాజెక్ట్”ను ఏకపక్షంగా ఏపి చేపట్టే ప్రయత్నాల పట్ల తెలంగాణ తీవ్ర అభ్యంతరకరం.. “బనకచర్ల ప్రాజెక్ట్” కోసం ఏపి చేసిన ప్రతిపాదనలపై కేంద్రం సత్వరమే స్పందించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ.. గోదావరి నది పై ప్రతిపాదించిన పలు సాగునీటి ప్రాజెక్ట్ లకు ఎంతో కాలంగా కేంద్రం అనుమతులు మంజూరు చెయ్యకుండా పెండింగ్ లో ఉన్నాయంటున్న తెలంగాణ.

Also Read:Gautam Gambhir: గంబీర్ రిపోర్ట్ కార్డ్.. టీం ఇండియా హెడ్ కోచ్ నుంచి తొలగించే అవకాశం!

తెలంగాణ ప్రతిపాదించిన పలు సాగునీటి ప్రాజెక్టులకు ముందుగా అనుమతులు మంజూరు చేసిన తర్వాతనే, “బనకచర్ల ప్రాజెక్ట్” కు అనుమతులు మంజూరు చేయాలని డిమాండు.. తెలంగాణ లో “పాలమూరు-రంగారెడ్డి”, “సమ్మక్క-సారక్క”, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు అన్ని అనుమతులు మంజూరు చెయ్యాలని డిమాండ్. గోదావరి నదీ వరద జలాలను మళ్ళించాలని ఏపి భావిస్తే, ఇచ్చంపల్లి-నాగార్జున సాగర్ అనుసంధానం పై కూడా చర్చలు జరపాలని తెలంగాణ డిమాండ్.. ఢిల్లీ లోని యమునా నదీ ప్రక్షాళన తరహా లో మూసీ నదీ పునరుజ్జీవనానికి కూడా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ.

Exit mobile version