రెబల్ స్టార్ ప్రభాస్.. అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటారు. తన సినిమాలు రిలీజ్ టైమ్ లో తప్ప బయట ఎక్కడ అంతగా కనిపించడు రెబల్ స్టార్. సినిమా వారి పార్టీలు వంటి వాటికి కాస్త దూరంగా ఉంటాడు. కేవలం తన క్లోజ్ సర్కిల్స్ తోనే సరదాలు, పార్టీలు. సినిమా రిలీజ్ రోజు అయితే ఎవరికీ టచ్ లో కూడా ఉండడు డార్లింగ్. ఒక్కడే తన ప్రయివేట్ స్పేస్ లో గడిపేస్తుంటాడు. అలాంటి డార్లింగ్ చాలారోజుల తర్వాత బయట కనిపించాడు. అది నిత్యం ఫుల్ రష్ ఉంటె ప్లేస్ లో .
Also Read : Vijay Devarakonda : అక్కడ ‘కింగ్‌డమ్’ కు బయ్యర్స్ కావలెను
ఇటీవల F1 అనే హాలీవుడ్ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ గా దూసుకెళ్తోంది. బ్రాడ్ పిట్ నటించిన ఈ సినిమాను సెలెబ్రెటీస్ తేగ పొగిడేస్తున్నారు. కాగా ఈ సినిమాను చూసేందుకు రెబల్ స్టార్ థియేటర్ కు వెళ్ళాడు. హైదరాబాద్ లోని బిజీయెస్ట్ ముల్టీప్లెక్స్ ప్రసాద్స్ లో రెబల్ స్టార్ సినిమా చూసేందుకు వచ్చాడు. ప్రభాస్ తో పాటు కన్నడ స్టార్ దర్శకులు ప్రశాంత్ నీల్ తో కలిసి ప్రసాద్ కు వచ్చాడు. F1 సినిమా చూస్తున్న ప్రభాస్ ను ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. దాంతో ఆ ఫోటో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఎన్నాళ్లకు ఆడియెన్స్ తో సినిమా చూస్తున్నావ్ డార్లింగ్ అని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. డైనోసార్ సినిమాకు వచ్చింది అని సొషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.