High Court: ఆ అధికారులపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం
- ఆ ఐదుగురు అధికారులపై కేసు నమోదు చేయండి.
- ప్రభుత్వ భూమిని ప్రవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు.
- కుషాయిగూడ పోలీసులకు హైకోర్టు ఆదేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana High Court: ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములుగా రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసినట్లు ప్రముఖ న్యాయవాది సుంకర నరేష్ స్పష్టం చేశారు. కాప్రా మాజీ తహశీల్దార్ ఎస్తేర్ అనిత, మాజీ సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి, మాజీ కాప్రా మండల సర్వేయర్ శ్రీష్మా, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు శాలిని, పొనుగుబాటి విశ్వనాధ్ లపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై మరింత విచారణ జరిపి, అభియోగ పత్రం దాఖలు చేయాలని కుషాయిగూడ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను న్యాయవాది సుంకర నరేష్ బుధవారం నాడు వెల్లడించారు.
CM Chandrababu: మంత్రులు, ఉన్నతాధికారులతో ముగిసిన సీఎం భేటీ.. స్వీట్ వార్నింగ్..!
Also Read
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
కాప్రా మండలంలోని సర్వే నెంబర్ 199 లోని ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ 177లో పట్టా భూమిగా చూపిస్తూ కొంతమంది భూ ఆక్రమణ దారులతో కలిసి ఆ సమయలో ఉన్న కాప్రా మండల తహశీల్దార్ ఎస్తేర్ అనిత, మండల సర్వేయర్ శ్రీష్మా, రెవిన్యూ ఇన్ స్పెక్టర్లు శాలిని, పొనుగుబాటి విశ్వనాధ్ లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పు ధ్రువపత్రాలు జారీ చేసి, పూర్వపు రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కుతూ వారికీ ఇష్టం వచ్చినట్లు లొకేషన్ స్కెచ్స్ మ్యాప్ జారీ చేశారని ఆయన తెలిపారు. వీరందరూ ఆ సమయంలో సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేసారని.. అధికారులు చేస్తున్న చట్ట వ్యతిరేక చర్యలను కుషాయిగూడకు చెందిన చప్పిడి కృష్ణారెడ్డి అనే సామాజిక కార్యకర్త ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుక వెళ్లగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ విచారణ జరిపి సదరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నిర్దారిస్తూ వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిసిఎల్ఏ కమీషనర్ కు తెలిపారు.
Tamannaah Bhatia: అందచందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న తమన్నా..
ఇక ఈ నివేదిక ఆధారంగా.. కృష్ణారెడ్డి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో అవినీతి అధికారులపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు అందించారు. కానీ., పోలీసులు పట్టించుకోకపోవడంతో న్యాయవాది సుంకర నరేష్ ద్వారా మల్కాజిగిరి కోర్టులో కేసు వేయగా ప్రభుత్వ అధికారుల మీద కేసు నమోదు చేయడానికి ముందస్తు అనుమతి తప్పనిసరని కింది కోర్టు ఆ కేసును తిరస్కరించింది. దీంతో న్యాయవాది సుంకర నరేష్ కింది కోర్టు ఉత్తర్వులు సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని హైకోర్టును ఆశ్రయించారు. అధికారులు ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని విధుల్లో నేరానికి పాల్పడిన వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ఎవరి నుండి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు తెలిపింది. ఈ కేసు సంబంధించి కింది కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ.. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. మరింత లోతైన విచారణ చేపట్టి కోర్టులో నేర అభియోగపత్రం దాఖలు చేయాలని హైకోర్టు కుషాయిగూడ పోలీసులను ఆదేశించిందని బాధితుడి తరుపు న్యాయవాది సుంకర నరేష్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?