పెళ్లిళ్ల సీజన్ కావడంతో అందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు.. ఇక సినీ తారల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వచ్చే ఏడాదికి ఇప్పుడు డేట్ ను ఫిక్స్ చేసుకుంటున్నారు.. ప్రస్తుతం టాలివుడ్ లో రెండు పెద్ద కుటుంబాల పెళ్లి జరగబోతుంది.. ఆస్కార్ గ్రహీత ఎమ్‌ఎమ్ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహ.. నటుడు మురళీ మోహన్ మనుమరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి.. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మురళీ మోహన్ ఇది నిజమేనని క్లారిటీ ఇచ్చారు..
వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో తన వివాహం జరగనుంది. అలాగే నా కొడుక్కి ఓ కూతురు సంతానం. ఈమె పెళ్లి కూడా దాదాపు ఖాయమైపోయింది. అందరూ ఊహించినట్లుగానే కీరవాణి ఇంటికి కోడలిగా వెళ్లనుంది.. పెద్ద మనుమరాలి పెళ్లి కూడా ఫిబ్రవరిలోనే జరిగిందని, ఈ పెళ్లి కూడా ఆ నెలలోనే చెయ్యాలని అనుకున్నారని చెప్పారు.. మురళీ మోహన్ కొడుకు రామ్ మోహన్. ఈయన ఏకైక కుమార్తె పేరు ‘రాగ’. కొద్దిరోజుల క్రితమే ఆమె బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం మాగంటి కుటుంబానికి సంబంధించి పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది..
ఆ బిజినెస్ లో రాగ కీలక భాధ్యతలను నిర్వహిస్తుంది.. ఇక ఇండస్ట్రీలో ఉన్నవారికి తన మనువరాలిని ఇవ్వాలని అనుకున్నట్లు తెలిపారు.. అలాగే ఈ క్రమంలోనే కీరవాణి అబ్బాయితో తన మనుమరాలు ‘రాగ’ను ఇచ్చి వివాహం చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఇక శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు.. ఆ తర్వాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా సెటిల్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు..