న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం నాని నటించిన హాయ్ నాన్న సినిమా విడుదలకు సిద్ధంగా వుంది.దసరా సినిమా భారీ విజయం సాధించడంతో హాయ్ నాన్న సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి…ఈ సినిమాను శౌర్యువ్ (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నాడు.హాయ్ నాన్న చిత్రంలో బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించింది.ఈ చిత్రానికి మలయాళం కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నారు.. ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి , డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు.తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో నాని టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. హాయ్ నాన్న మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలు చాట్ బస్టర్‌గా నిలిచాయి.. సమయమా, గాజుబొమ్మ పాటలతోపాటు లేటెస్ట్ గా శృతిహాసన్, నానిపై వచ్చే ఒడియమ్మ పార్టీ సాంగ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..ఇదిలా ఉంటే యూఎస్‌ఏ రీజియన్‌లో నానికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. యూఎస్‌ఏలో అత్యధికంగా (ఎనిమిది) 1 మిలియన్ డాలర్లు మార్క్ సాధించిన సినిమాలున్న హీరోగా నాని కి అరుదైన రికార్డు వుంది.. తాజాగా హాయ్ నాన్న యూఎస్‌ఏ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి.. ప్రీ సేల్స్ రూ. 20,82,780 బిజినెస్ జరిగినట్టు తాజా సమాచారం. వారం ముందుగానే ఈ స్థాయిలో సేల్స్ ఉండటం సినిమాకు బాగా కలిసొచ్చే విషయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.. మరి నాని నటించిన హాయ్ నాన్న సినిమా కూడా 1 మిలియన్ మార్క్ సాధిస్తుందో లేదో చూడాలి..