సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి.. అప్పుడే ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తాయి.. ఆ రెండు ఉన్న హీరో సుహాస్.. మొదట షార్ట్ స్టోరీస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్స్ క్యారక్టర్ లు చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అతని దశ పూర్తిగా మారిపోయింది.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరో అయ్యాడు..
సుహాస్ హీరోగా చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ను అందుకోవడంతో మంచి కలెక్షన్స్ ను కూడా రాబడుతున్నాయి. దాంతో అతనితో సినిమాలు చెయ్యడానికి దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.. గత ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఈ ఏడాదిలో అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ తో మరోసారి ఆడియన్స్ ని మెప్పించాడు. ప్రస్తుతం ఓటీటీలో కూడా బ్యాండ్ మోగిస్తుంది. భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది.. అయితే ప్రస్తుతం సుహాస్ టాలీవుడ్ లో అందరికంటే బిజీయెస్ట్ హీరోగా మారిపోయాడని చెప్పాలి..
ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. మొత్తంగా చూసుకుంటే ఏడు సినిమాలను లైనప్ లో పెట్టుకున్నాడు.. సుహాస్ ఈ ఇయర్ లోనే ఏడుకి పైగా సినిమాల్లో నటిస్తుండడం విశేషం.. విరాజ్ తో కలిసి శ్రీ రంగ నీతులు సినిమాతో రానున్నాడు. అలాగే నెక్స్ట్ మంత్ ప్రసన్నవదనం సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు.. ఇవి కాక కేబుల్ రెడ్డి, ఆనందరావు అడ్వెంచర్స్, గొర్రె పురాణం, ఉప్పు కప్పురంబు, జనక అయితే గనక అనే సినిమాలు కూడా చేస్తున్నాడు.. అతని సినిమాలన్ని ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్నాయి..
ఏప్రిల్ లో శ్రీ రంగ నీతులు సినిమాతో రానున్నాడు. ఇక మే 3న ప్రసన్న వదనం సినిమాతో వస్తున్నాడని అనౌన్స్ చేశారు.. అలాగే జూన్ లో కేబుల్ రెడ్డి, జులై లో గొర్రె పురాణం సినిమాలు విడుదల కాబోతున్నాయి.. కేవలం నాలుగు నెలల్లోనే నాలుగు సినిమాలతో రాబోతున్నాడు.. ఏ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి మరి..