Ram Charan RC16: కడపలో అమ్మవారి పాదాల చెంత RC16 స్క్రిప్ట్..
- కడపలో అమ్మవారి పాదాల చెంత RC16 స్క్రిప్ట్..
- సినీ డైరెక్టర్ బుచ్చిబాబు కూడా పాల్గొన్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan RC16: నేడు గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ కడప నగరంలోని పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాత్రి 7 గంటల సమయంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప నగరానికి బయలుదేరి వెళ్లారు. ఇక కడప చేరుకున్న రామ్ చరణ్ కు విమానాశ్రయం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయలుదేరిన రామ్ చరణ్ నేరుగా కడప నగరంలోని విజయదుర్గ దేవాలయానికి వెళ్లారు. అక్కడ ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇకపోతే, అక్కడ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా విడుదల తర్వాత సెట్స్ పైకి వెళ్లే #RC 16 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పేపర్లను అమ్మవారి దగ్గర ఉంచి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ డైరెక్టర్ బుచ్చిబాబు కూడా పాల్గొన్నారు. ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు అందుకున్న రామ్ చరణ్ తేజ ఆ తర్వాత నగరంలోని పెద్ద దర్గాకు వెళ్లారు.
Also Read: Naga Chaitanya Wedding Card: శుభ లేఖలను పంచుతున్న అక్కినేని ఫ్యామిలీ.. శుభలేఖను చూసారా?
Also Read
- Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
- Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
- Best Batting Pair: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాదు.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్ జోడి ఇదే..
- Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
ఇక ప్రస్తుతం జరుగుతున్న అమీన్‌పీర్ దర్గా 80వ నేషనల్ ముషాయిర గజల్ ఈవెంట్లో హీరో రామ్ చరణ్ తేజ్ పాల్గొన్నాడు. దర్గాకు చేరుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్గాలో ముషాయిర కార్యక్రమంలో రామ్ చరణ్ తేజ్ పాల్గొని చాదర్ సమర్పించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కడప నగరంలో విమానాశ్రయం నుంచి గుడికి వెళ్లే సమయంలో మెగా అభిమానుల కోలాహలం తారస్థాయికి చేరుకుంది. అడుగడుగున రామ్ చరణ్ తేజ్ కు మెహ అభిమానులు నీరాజనాలు పట్టారు.
తాజావార్తలు
-
Ratna Debnath: ‘నేను నా కూతురిని కోల్పోయా.. ఆమె తన కుర్చీని కోల్పోయింది’.. మమతపై ఆర్జీ కార్ బాధితురాలి తల్లి విమర్శలు
-
Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
-
OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
-
Zepto: దలాల్ స్ట్రీట్‌లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
-
Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?