Heeramandi Actress Sonakshi Sinha React on Bold Scenes: సినిమాలకు సైన్ ముందు హీరోయిన్స్ కండిషన్స్ పెట్టడం ఇండస్ట్రీలో సహజమే. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్. బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా కూడా సినిమాకు సైన్ చేసేముందు కొన్ని కండిషన్స్ పెడతారట. బోల్డ్ సన్నివేశాల్లో తాను అస్సలు నటించనని ఖరాఖండిగా చెబుతారట. చిన్న ముద్దు సీన్‌లో కూడా నటించనని చెబుతారట. కెరీర్ ఆరంభం నుంచి ఈ కండిషన్స్ పాటిస్తున్నాని తాజాగా సోనాక్షి చెపుకొచ్చారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’లో సోనాక్షి నటించిన విషయం తెలిసిందే.
హీరామండిలో సోనాక్షి సిన్హాతో పాటు మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. హీరామండి టీమ్ తాజాగా కపిల్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనాక్షి పలు విషయాలపై స్పందించారు. ‘నా కెరీర్‌లో ఇప్పటివరకు 30కి పైగా సినిమాలు చేశాను. ఇప్పటివరకు ఒక్క శృంగార సన్నివేశంలో కూడా నేను నటించలేదు. బోల్డ్ సీన్స్ అస్సలు ఉండొద్దని దర్శక-నిర్మాతలకు ముందే చెబుతాను. షూటింగ్ మధ్యలో బోల్డ్ సీన్స్ చేయాలని రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోను’ అని సోనాక్షి చెప్పారు.
Also Read: Disha Patani: దిశా పటాని వేసుకున్న ‘లవ్’ షార్ట్ డ్రెస్ ఖరీదెంతో తెలుసా?
‘అవసరమైతే సినిమా నుంచి తప్పుకుంటాను కానీ.. బోల్డ్ సీన్‌లలో మాత్రం అస్సలు నటించను. శృంగార సన్నివేశాల్లో నటించడానికి నేను దూరంగా ఉంటాను. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. భవిష్యత్తులో ఇంతే. దర్శక-నిర్మాతలు నేను పెట్టే కండిషన్స్‌కు ఒకే చెబితేనే సినిమాకు సైన్ చేస్తాను’ అని సోనాక్షి సిన్హా తెలిపారు. 2010లో వచ్చిన దబాంగ్ సినిమాతో సోనాక్షి ఇండస్ట్రీలోకి వచ్చారు. రౌడీ రాథోడ్, ఆర్ రాజ్ కుమార్, డబుల్ ఎక్సెల్, లుతేర, అకిరా లాంటి సినిమాటలతో సత్తాచాటారు.