Site icon NTV Telugu

Delhi: ఢిల్లీ ఎయిర్పోర్ట్‌లో భారీగా బంగారం ప‌ట్టివేత‌..

Delhi Gold

Delhi Gold

ఢిల్లీ అంత‌ర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని ప‌ట్టుకున్నారు క‌స్టమ్స్ అధికారులు. సుమారు 3353 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.1.92 కోట్ల వ‌ర‌కు ఉంటుందని తెలిపారు. విదేశీ ప్రయాణీకులు బంగారాన్ని పేస్టుగా మార్చి లగేజ్ బ్యాగ్ లో దాచి పట్టుకొస్తుండగా తనిఖీలు చేపట్టడంతో బట్టబయలైంది. దుబాయ్ నుండి తీసుకొచ్చిన బంగారాన్ని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వాష్ రూమ్ వద్ద మరో వ్యక్తికి అప్పగిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

Read Also: Praja Galam: చిలకలూరిపేటలో ప్రజాగళం సభ.. మోడీ ప్రసంగంపైనే సర్వత్రా ఆసక్తి

క‌స్టమ్స్ అధికారుల నుంచి బురుడి కొట్టించ‌డానికి బంగారాన్ని వివిధ ప‌ద్దతుల ద్వారా ర‌వాణా చేసేందుకు స్మగ్లర్లు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. అయితే, కార్గో ఎయిర్‌లో అత్యాధునిక స్కానింగ్‌తో డిఆర్ఐ అధికారులు త‌నిఖీలు నిర్వహించారు. ఈ స్కానింగ్‌లో బంగారం గుట్టు బ‌య‌ట‌ప‌డింది. అక్రమ బంగారం స‌ర‌ఫ‌రా కేసును న‌మోదు చేసిన అధికారులు.. ఇద్దరు విదేశీ ప్రయాణీకులతో పాటు మరో ఇద్దరిని కస్టమ్స్ బృందం అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలుగురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Aroori Ramesh: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే..

Exit mobile version