Site icon NTV Telugu

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటల సమయం..!

Tirumala

Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఉధృతంగా కొనసాగుతోంది. భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో పోటెత్తుతుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి పోయాయి. వీటితో పాటు వెలుపల కూడా భక్తులు గట్టి క్యూలైన్లలో వేచి నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనం కోసం ప్రస్తుతం భక్తులకు సుమారు 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లో భక్తుల రద్దీతో అధికారులు భద్రతా ఏర్పాట్లు, నీటి సదుపాయాలు, అన్నప్రసాద పంపిణీ వంటి చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు.

Read Also: Asaduddin Owaisi: మోడీ, చంద్రబాబు, పవన్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..!

గత 24 గంటల్లో 91,720 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో 44,678 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన కానుకల మొత్తం రూ. 3.8 కోట్లుగా అధికారులు వెల్లడించారు. తిరుమల టిటిడి అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే వారు తగు రద్దీ తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం సమంజసం.

Read Also: Fathers Day : నాన్నంటే అలుపెరుగని పోరాటం.. నేడే ఫాదర్స్ డే..!

Exit mobile version