Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఉధృతంగా కొనసాగుతోంది. భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో పోటెత్తుతుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి పోయాయి. వీటితో పాటు వెలుపల కూడా భక్తులు గట్టి క్యూలైన్లలో వేచి నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనం కోసం ప్రస్తుతం భక్తులకు సుమారు 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల రద్దీతో అధికారులు భద్రతా ఏర్పాట్లు, నీటి సదుపాయాలు, అన్నప్రసాద పంపిణీ వంటి…