illicit Affairs: తిరుపతి జిల్లా కేవీబీ పురంలో దారుణం చోటు చేసుకుంది. కూతురు ముందే అల్లుడుతో పెళ్ళికి ఓ తల్లి యత్నించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక, అడ్డుకున్నందుకు కూతురుపై రోకలి బండతో తల్లి, భర్త దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. కేవీబీ పురం గ్రామంలో ఐదు నెలల క్రితం 18 ఏళ్ళ బాలుడు, 15 ఏళ్ళ మైనర్ బాలికను ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు. మైనర్ బాలిక తల్లి సైతం అల్లుడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇక, గత కొన్ని రోజులుగా అల్లుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
Read Also: Woman Gives Birth: ట్రైన్ లోనే మహిళ ప్రసవం.. చప్పట్లతో మారుమోగిన కంపార్ట్మెంట్
అయితే, మొన్న రాత్రి భార్య ఇంట్లో ఉండగానే అత్త, అల్లుడు పెళ్ళి చేసుకోవడానికి సిద్దం అయ్యారు. తాళి కడుతున్న సమయంలో కూతురు అడ్డుకోవడంతో.. ఆగ్రహంతో రోకలి బండతో బాలిక తల్లి, భర్త దాడి చేశారు. సదరు మైనర్ బాలిక కేకలు వేయడంతో బాలికను కాపాడే ఆసుపత్రికి తరలించిన స్థానికులు.. అత్త, అల్లుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.