హైదరాబాదతో ఫాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో.. ప్రజలకు వేసవి వేడి నుండి చాలా ఉపశమనం లభించింది. ఎల్‌బి నగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, నాగోల్, సరూర్ నగర్, ఘటకేసర్, పీర్జాది గూడ, వనస్థలిపురం, అంబర్‌పేట్, సైదాబాద్, సంతోష్ నగర్ చార్మినార్, చాంద్రాయణగుట్ట సహా కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నిర్మల్ జిల్లాలోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికి కొన్ని చోట్ల చెట్లు నేలకూలాయి, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి, కార్లు దెబ్బతిన్నాయి.
Also Read: NTR 30: ఇంట గెలిచి.. రచ్చ గెలువు పాప
ఇదిలా ఉంటే.. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని దక్షిణ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండగా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లా కొందుర్గ్, చేవెళ్ల, వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట, మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ అనే మరో గ్రామంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నల్గొండలో నమోదైంది — మే 10 ఉదయం 8.30 గంటలకు 40.5 డిగ్రీల సెల్సియస్. పటాన్‌చెరులో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 20.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పటాన్‌చెరులో కూడా దాదాపు 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also Read : Dhanush: కిల్లర్.. కిల్లర్.. కెప్టెన్ మిల్లర్.. వచ్చేశాడు