Ragi Thopa Recipe: సాంప్రదాయ రుచి, కాల్షియం, ఐరన్‌తో నిండిన ‘రాగి తోపా’.. ఇలా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Thopa Recipe: మన సంప్రదాయ వంటకాలలో రాగితో చేసిన వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంది. కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే రాగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ తినగలిగే సూపర్ హెల్తీ ఫుడ్‌గా రాగి తోపా (రాగి హల్వా) ప్రసిద్ధి చెందింది. సాధారణంగా షుగర్‌తో చేసే స్వీట్లకు బదులుగా బెల్లంతో తయారు చేసే ఈ రాగి తోపా ఆరోగ్యానికి ఇంకా మంచిది.
AP Assembly Budget Sessions 2026: రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాం.. వైఎస్ జగన్ కూడా వస్తారు..
Also Read
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
రాగి తోపా తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఒక కప్పు తురిమిన బెల్లం వేసి, దానికి రెండు నుంచి రెండున్నర కప్పుల నీళ్లు పోయాలి. మీడియం మంటపై గరిటతో కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించాలి. తర్వాత ఈ బెల్లం నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
అదే కడాయిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కరిగిన తర్వాత ఒక కప్పు రాగి పిండి వేసి సన్నటి మంటపై రెండు మూడు నిమిషాలు వేయించాలి. కమ్మటి వాసన వచ్చే వరకు వేయిస్తే రాగి తోపా రుచి మరింత బాగుంటుంది. ఆ తర్వాత అర కప్పు పచ్చికొబ్బరి తురుము వేసి కొద్దిసేపు వేయించాలి. ఇది ఇష్టం లేని వారు వాడకపోయినా సరే. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసిన బెల్లం నీటిని కొంచెం కొంచెంగా పోస్తూ నిరంతరం కలపాలి. ఉండలు పడకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. సన్నటి మంటపై ఉడికిస్తే సరైన కన్సిస్టెన్సీ వస్తుంది.
Allu Arjun: అల్లు అర్జున్ వివాదంపై ఐకాన్ స్టార్ టీం అధికారిక ప్రకటన.. లేఖలో ఏముందంటే?
పాన్‌కు అంటుకుంటున్నట్లు అనిపిస్తే కొద్దిగా నెయ్యి వేస్తూ కలపాలి. చివరగా అర టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి మరో రెండు స్పూన్లు నెయ్యి జోడించాలి. మిశ్రమం పాన్ నుంచి వదులుగా వేరైపోతే రాగి తోపా సిద్ధమైనట్లే. వేడిగా లేదా చల్లారిన తర్వాత కూడా ఈ రాగి తోపాను సర్వ్ చేసుకోవచ్చు. ఇది మూడు నాలుగు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. శరీరానికి బలం ఇవ్వడమే కాకుండా వేసవిలో చల్లదనాన్ని కూడా ఇస్తుంది ఈ వంటకం.
తాజావార్తలు
-
Punganur Violence: పుంగనూరు ఘటనలో.. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు!
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!