ఈరోజుల్లో జనాలు డబ్బుల మీద ఉన్న ప్రేమ, యావ తో అత్యాశతో డబ్బులకోసం గడ్డి తింటున్నారు.. డబ్బులను సంపాదించాలనే కోరిక వల్ల లైఫ్ ను గడుపుతున్నారు..కనీసం తినడానికి కూడా టైమ్ లేనంత బిజీగా ఉంటున్నారు.. అందుబాటులో ఉందని, అలాగే సులభంగా తయారు చేసుకోవచ్చని ఏదో ఒకటి ఉదయం పూట ఖాళీ కడుపుతో తింటే మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని కొన్ని ఆహారాలు ఉంటాయి. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో తీసుకోకూడని వాటిల్లో కాఫీ, టీ లు కూడా ఒకటి. చాలా మంది బెడ్ కాఫీ, టీ లను తాగేస్తూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల మన శరీరంలో హార్మోన్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎసిడిటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. కనుక ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ, కాఫీ లు తాగే అలవాటు ఉన్న వారు ఆ అలవాటును సాధ్యమైనంత త్వరగా మానుకోవాలి. మరికొంతమంది పరగడుపున కూల్ డ్రింక్స్, సోడా వంటి చల్లటి పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపులో అల్సర్స్, వాంతులు అవ్వడం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అంతగా మీకు తాగాలనిపిస్తే వీటికి బదులుగా తాజా పండ్ల రసాన్ని తీసుకోవడం మంచిది…
ఖాళీకడుపుతో టమాటాలను తీసుకోకూడదు. ఉదయం పూట ఖాళీ కడుపుతో టమాటాలను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే యాసిడ్ల కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఉదయం పూట ఖాళీ కడుపుతో కారంగా ఉండే పదార్థాలను, మసాలా దట్టించి వండిన పదార్థాలను తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, అల్సర్లు వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అదే విధంగా పెరుగును తీసుకోకూడదు. పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికి దీనిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. ఇక చివరగా ఆల్కాహాల్ ను కూడా తీసుకోకూడదు, పుల్లగా ఉండే వాటిని అస్సలు తీసుకోకండి..ఉదయం ఎట్టి పరిస్థితిలో కూడా వీటి జోలికి అస్సలు వెళ్ళకండి.. ఒకవేళ తాగితే మీ ప్రాణాలను మీరే రిస్క్ లో పడేసిన వాళ్లు అవుతారు సుమా జాగ్రత్త..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.