Site icon NTV Telugu

Manohar Lal Khattar: ఢిల్లీకి సాయం చేస్తా.. సీఎంగా తన బాధ్యతలు నిర్వర్తించడం లేదు..!

Aravind

Aravind

ఢిల్లీలో వరదల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ఢిల్లీ ప్రజల గురించి ఆలోచించాలన్నారు. ఒక సీఎంగా ఉండి తన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీకి తాము పూర్తి సాయం చేస్తామని అన్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో ఉన్నాయని హర్యానా సీఎం ఆరోపించారు. హర్యానా నుంచి అందుతున్న నీటికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చెల్లించలేదన్నారు. ఢిల్లీ ప్రజలతో తాము ఉన్నామన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ విదూషకులలా మాట్లాడటం సరికాదన్నారు ఆయన.

Suriya: రియల్ లైఫ్ లో రోలెక్స్ స్టార్ హీరోనే…

మరోవైపు కేజ్రీవాల్ ప్రభుత్వంపై.. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వరద నియంత్రణ ఆదేశాల మేరకు జరగాల్సిన సమావేశాన్ని గత రెండేళ్లుగా ఎందుకు నిర్వహించలేదో కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు చెప్పాలని అన్నారు. వరదలకు సంబంధించి ప్రభుత్వం ముందుగా ఎందుకు ప్రణాళిక రూపొందించలేదని ప్రశ్నించారు. మరోవైపు హర్యానా నుండి తక్కువ నీటిని విడుదల చేసినప్పుడు, ఢిల్లీ ఎలా ముంపునకు గురైందని కేజ్రీవాల్ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి అన్నారు. యమునా శుద్దీకరణ పేరుతో 6800 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు.

IND W vs BAN W: బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా వరుసగా రెండోసారి ఓటమి..

ఢిల్లీలో భారీ వరదలకు కేంద్ర ప్రభుత్వం, హర్యానా సర్కారు చేసిన కుట్రే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. హత్నికుండ్ బ్యారేజ్ నుంచి ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేయడం వల్లే యమునా నది నీటిమట్టం పెరిగి ఢిల్లీ వీధుల్లోకి నీళ్లు వచ్చాయని కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు మండిపడ్డారు.

Exit mobile version