Brutally Beaten : ప్రియురాలు అర్ధరాత్రి ప్రేమతో పిలిచిందని కలిసేందుకు వెళ్లాడు. అక్కడే కాచుకుని కూర్చున్న గుంపు దారుణంగా కొట్టడంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన కేరళలోని త్రిసూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వృత్తిరీత్యా బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న అవివాహిత యువకుడు సహర్ అర్ధరాత్రి తన వివాహిత ప్రియురాలిని కలవడానికి వెళ్లాడు. వివాహిత ఇంటి సమీపంలోని గుడిదగ్గర మోరల్ పోలీసింగ్ పేరుతో కూర్చున్న ఓ గుంపు ఆ యువకుడిని మొదట విచారించింది. ఆ తర్వాత యువకుడిపై దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన అంతా ఓ గుడి దగ్గర ఉన్న కెమెరాలో రికార్డయింది. ఈ షాకింగ్ సంఘటన ఫిబ్రవరి 18 న జరిగింది. గాయపడిన బస్సు డ్రైవర్ మంగళవారం త్రిసూర్ ఆసుపత్రిలో మరణించాడు. కిడ్నీలు, పక్కటెముకలకు తీవ్ర గాయాలు కావడంతో యువకుడు చికిత్స పొందుతూ మరణించాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ కేసులో పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. కాగా, ఘటనానంతరం నిందితులు పరారీలో ఉన్నారు.
Read Also : Big Breaking: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. రేపు రాజధానికి రావాలని కవితకు ఈడీ నోటీసులు
కేరళలోని త్రిసూర్‌లో మోరల్ పోలీసింగ్ పేరుతో ఎనిమిది మంది ఓ గుడి దగ్గర కూర్చొన్నారు. ఇంతలో సహర్ అటుగా వెళ్తుండడం చూసి ఎవరికోసం వచ్చావంటూ విచారించారు. ఈ విచారణలో నిజం చెప్పాలంటూ వ్యక్తుల బృందం అతన్ని తీవ్రంగా కొట్టారు. ఆ దాడిలో అతడు సృహ తప్పి పోయాడు..
పోలీసులు మీడియాకు అందించిన సమాచారం ప్రకారం.. చెర్పుకు చెందిన ఈ యువకుడికి అర్ధరాత్రి తన ప్రియురాలి నుంచి కాల్ రావడంతో ఆమెను కలిసేందుకు వెళ్లాడు. వివాహిత ఇంటి దగ్గర కూర్చున్న ఓ గుంపు ఆ యువకుడిని మొదట విచారించి ఆ తర్వాత కాళ్లతో కొట్టి చంపింది. గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో రాహుల్, బిజిత్, విష్ణు, బిను, అరుణ్, అభిలాష్‌లపై కేసు నమోదు చేశారు. గుడిలో యువకుడిని కిరాతకంగా కొట్టిన దృశ్యం రికార్డైంది. ఘటన అనంతరం ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. యువకుడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.