భారత్, జపాన్‌లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు దుమారం చెలరేగడంతో వాట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఆయా దేశాల పట్ల బైడెన్‌కు అమితమైన గౌరవం ఉందని తెలిపింది. విదేశీ వలసదారులను అనుమతించేందుకు భారత్ భయపడుతుందని బుధవారం బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్‌లదీ అదే పరిస్థితి అని చెప్పుకొచ్చారు. ఆ దేశాలు వలసదారులను ఎంత మాత్రమూ ఆహ్వానించవని పేర్కొన్నారు. అందుకే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందకుండా ఇబ్బంది పడుతున్నాయని వివరించారు. అందుకు భిన్నంగా అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తుందని.. వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తుంటారని చెప్పారు. బైడెన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావటంతో శ్వేతసౌధం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఇది కూడా చదవండి: Samantha : ఎప్పుడూ మీరు దానిని కోల్పోకండి.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..
జపాన్, భారత్‌తో మాకు బలమైన సంబంధాలున్నాయని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. వలసదారులు దేశానికి ఎంత కీలకమో… వారు ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారో బైడెన్ చెప్పారని శ్వేతసౌధం అధికార ప్రతినిధి కరీన్ జీన్ పియర్ వివరించారు. ఈ వ్యాఖ్యలను విస్తృత అర్థంలో తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. భిన్నత్వమే అమెరికాను బలపరుస్తోందని బైడెన్ విశ్వసిస్తున్నారని తెలిపారు. అందుకే వలసదారుల దేశంగా అమెరికా గుర్తింపు పొందడం తమకు ఎంతో ప్రయోజనమని తెలిపారు.
ఇది కూడా చదవండి: Gold Price Today : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారు, స్థిరంగా వెండి ధరలు.. ఎంతంటే?
ఇదిలా ఉంటే నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే వలస విధానంపై వీరిద్దరిపై విమర్శలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: AP Elections 2024: చూసైనా మారండి..! 104 ఏళ్ల తాతయ్య.. 18వ సారి ఓటు హక్కు వినియోగించుకున్నారు..